
ఫ్లిప్‌కార్ట్ రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ పేరుతో సరికొత్త సేల్ ను తీసుకొచ్చింది. ఈ సేల్ మార్చి 10 నుంచి 14 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ కూలింగ్ డేస్ సేల్ లో ఎయిర్ కండీషనర్, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాన్స్, ఎయిర్ కూలర్లు, వాటర్ ప్యూరిఫైయర్‌లపై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించింది. శాంసంగ్, బ్లూస్టార్, హిటాచీ, ఎల్‌జీ, వోల్టాస్ లాంటి బ్రాండ్స్‌కు చెందిన ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ లభిస్తాయి. ఏసీ కొనాలనుకునేవారికి వాల్‌పూల్, మార్క్యూ, ఒనిడా లాంటి బ్రాండ్స్ నుంచి ప్రత్యేక డీల్స్ ఉన్నాయి. ఏసీ, ఇన్వర్టర్ ఏసీ, త్రీ స్టార్ ఏసీ, విండో ఏసీ లాంటి వేర్వేరు ప్రొడక్ట్స్‌పై ఆఫర్స్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 6 నెలల నుంచి 24 నెలల నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో ఈ ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఏసీ కొనాలనుకునేవారికి 0.8 నుంచి 1.5 టన్స్ వరకు అనేక ఆప్షన్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ సెక్షన్‌లో వీటితో పాటు సీలింగ్ ఫ్యాన్స్, వాల్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్‌పైనా ఆఫర్స్ ఉన్నాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment