సాక్షి, ముంబై: వాషింగ్‌మెషీన్లు, ఏసీలు,టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లపై ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తగ్గింపు ధరల సేల్ ప్రారంభించింది. ముఖ్యంగా టీవీలపై భారీ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. ఈ ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 23 నుంచి 27 వరకు కొనసాగనుంది. ఐదు రోజుల పాటు కొనసాగే ఈ సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లు, ఈఎంఐ లావాదేవీలపై రూ.1500 తగ్గింపు కూడా లభ్యం.
వూ ప్రీమియం అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ
43 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ (4కే ) ఎల్‌ఈడీ టీవీ ఎలక్ట్రానిక్స్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 26,999లకే లభ్యం. దీని ఎంఆర్‌పీ ధర రూ. 45,000. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.
ఎంఐ 5 ఎక్స్ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ
43 అంగుళాల అల్ట్రా హెచ్‌డీ (4కే)టీవీని ఫ్లిప్‌కార్ట్ ఇపుడు రూ. 31,999 దీని ఎంఆర్‌పీ ధర రూ. 49,999. 8 వేల దాకా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్. HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై 2,000 తగ్గింపు.
రియల్‌మీ హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ
32-అంగుళాల హెచ్‌డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీని ఫ్లిప్‌కార్ట్ రూ. 15,999లకే సొంతంచేసుకోవచ్చు. దీని ఎంఆర్‌పీ ధర రూ. 17,999. దీంతోపాటు 8 వేల దాకా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ లభ్యం. Axis Bank కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.
వోల్టాస్ 1.5 టన్ 5 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ AC
వోల్టాస్ 1.5 టన్న 5 స్టార్ స్ప్లిట్ ఇన్వెర్టర్ ఏసీ తక్కువ ధర రూపాయలలో ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. రూ. 67,990 ల ఏసీని ఈ సేల్ లో కేవలం రూ. 37,999లకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్ సేల్ జూన్ 2022 సందర్భంగా. Axis బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్.
శాంసంగ్ సింగిల్ డోర్ 5 స్టార్ రిఫ్రిజిరేటర్
శాంసంగ్ 198 లీటర్ల 198 లీటర్ల డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ ఫ్రిజ్ రూ. 18,000 (ఎంఆర్‌పీ ధర రూ. 21,990). 12 వేల రూపాయల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.
ఒనిడా 7కేజీ 5 స్టార్ వాషింగ్ మెషీన్
ఒనిడా 7కేజీ 5 స్టార్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ తగ్గింపు ధరలో రూ.13,490కి లభ్యం. దీని ఎంఆర్‌పీ ధర. రూ. 21,990 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో కూడా దీన్ని కొనుగోలు చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment