న్యూఢిల్లీ: రిఫ్రిజిరేటర్లు మరింత ప్రియం కానున్నాయి. ధరలు 5 శాతం వరకు అధికం అయ్యే అవకాశం ఉంది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ (బీఈఈ) నూతన ప్రమాణాలు జనవరి 1 నుంచి అమలులోకి రావడమే ఇందుకు కారణం. కొత్త ప్రమాణాల కారణంగా మోడల్‌నుబట్టి 2–5 శాతం ధర పెరగవచ్చని గోద్రెజ్ అప్లయెన్సెస్, హాయర్, ప్యానాసోనిక్ వెల్లడించాయి.
ఫ్రాస్ట్–ఫ్రీ మోడళ్లలో ఫ్రీజర్స్, రిఫ్రిజిరేటర్ ప్రొవిజనింగ్ యూనిట్‌ల (నిల్వ విభాగం) కోసం వేర్వేరుగా స్టార్ లేబులింగ్‌ను బీఈఈ తప్పనిసరి చేసింది. రిఫ్రిజిరేటర్ స్థూల సామర్థ్యానికి బదులు నికర సామర్థ్యం (వినియోగం అయ్యే స్థలం) ఆధారంగానే కంపెనీలు స్టార్ లేబులింగ్ చేయాల్సి ఉంటుంది. రీసెర్చ్ అండ్ మార్కెట్స్ నివేదిక ప్రకారం భారత్‌లో రిఫ్రిజిరేటర్ల విపణి 2022లో రూ.25,352 కోట్లు ఉంది.
Comments
Please login to add a commentAdd a comment