Mini fridges
-
‘సో చిల్’.. ఆటబొమ్మలాంటి బుల్లి ఫ్రిజ్
బ్రిటన్‌కు చెందిన ఆటబొమ్మల తయారీ సంస్థ ‘కెనాల్ టాయ్స్’ ఇటీవల ఆటబొమ్మలాంటి ఫ్రిజ్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ముఖ్యంగా టీనేజీ పిల్లలకు ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దింది. ఇందులో మేకప్ సామగ్రిని, పానీయాలను భద్రపరచుకోవచ్చు. ఇందులో రిమూవబుల్ షెల్ఫ్‌ను ఏర్పాటు చేశారు. వస్తువులు పెట్టుకోవడానికి షెల్ఫ్ అవరోధం అనుకుంటే, షెల్ఫ్‌ను బయటకు తీసేసి కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. చాలా తేలికగా దీనిని బయటకు తీసుకువెళ్లవచ్చు. దీనితో పాటు ఒక స్టిక్కర్ సెట్ ఉచితంగా లభిస్తుంది. ఫ్రిజ్‌ను కోరుకున్న రీతిలో అలంకరించుకోవడానికి ఈ స్టిక్కర్లను ఉపయోగించుకోవచ్చు. దీని ధర 44.99 పౌండ్లు (రూ.4,696) మాత్రమే! ఇదీ చదవండి: ఇది ఈ-ట్రైక్! మూడుచక్రాల ఈ-సైకిల్.. తొక్కొచ్చు.. తోలొచ్చు! -
ఫ్రిజ్, టీవీ, ఐపాడ్, మాస్క్: ఆటోనా.. హైటెక్ హోటలా?
చెన్నై: మనలో అందరికి చాలా ఆశలు, కోరికలుంటాయి. కానీ కొందరు మాత్రమే తన వాటిని తమ కలలను సాకారం చేసుకుంటారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. సరే వాటిని అధిగమించి.. తాము అనుకున్నది సాధిస్తారు. సాధించాలనే సంకల్పం, గట్టి పట్టుడదల ఉంటే చాలు.. మిగతా సమస్యలన్ని దూది పింజల్లా తేలిపోతాయి. ఈ మాటలకు ఆకారం వస్తే.. అతడు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆటోవాలా అన్నా దురైలా ఉంటాడు. పారిశ్రామికవేత్త కావాలనేది అన్నాదురై చిన్ననాటి కోరిక. కానీ దానికి తగ్గ డబ్బు, చదువు అతడి వద్ద లేదు. అయితే ఇవేవి అతడిని అడ్డుకోలేకపోయాయి. తన దగ్గరున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు. దానిలో ఎక్కే కస్టమర్లను ఆకర్షించడం కోసం అతడు ఎంచుకున్న మార్గం.. ఇప్పుడతన్ని ప్రత్యేకంగా, వార్తల్లో నిలిచే వ్యక్తిగా మార్చింది. అన్నాదురైకి సంబంధించిన కథనాన్ని హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. తమిళనాడు, చెన్నైకి చెందిన అన్నాదురై ఆర్థిక ఇబ్బందులు వల్ల పెద్దగా చదువుకోలేదు. కానీ పారిశ్రామికవేత్త కావాలనేది అతడి కోరిక. అయితే కుటుంబ పరిస్థితులు దృష్ట్యా ఆటో నడపాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కానీ పారిశ్రామికవేత్త కావాలనే అతడి కోరిక మాత్రం తనని నిద్రపోనివ్వలేదు. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా అతడికి తట్టిన ఓ వినూత్న ఐడియా అన్నాదురై జీవితాన్ని మార్చేసింది. తాను నడుపుతున్న ఆటోనే ఓ పరిశ్రమలా భావించాడు అన్నాదురై. ఇక తన ఆటోలోకి ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించాలంటే ఏం చేయాలా అని బాగా ఆలోచించాడు. ప్రస్తుతం కోవిడ్ విజృంభిస్తుంది. కనుక జనాలు ఆటోల్లో తిరగాలంటే భద్రత ముఖ్యం.. ఆ తర్వాత ప్రయాణికులు తమ గమ్యస్థానం చేరేవరకు వారికి ఎంటర్టైన్మెంట్ కల్పించడం ముఖ్యం అనుకున్నాడు. ఈ మేరకు ఓ ప్రణాళిక రచించాడు అన్నాదురై. దాని ప్రకారం తన ఆటోలో మాస్క్, శానిటైజర్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత ఓ ఐపాడ్, టీవీ, చిన్న ఫ్రిజ్ ఏర్పాటు చేశాడు. ఆటో ఎక్కిన వారికి అందులో ఉన్న సౌకర్యాలు చూస్తే నిజంగానే మతి పోతుంది. తాము ఆటో ఎక్కామా లేక.. ఏదైనా స్టార్ హోటల్లో ఉన్నామా అనే అనుమానం కలగక మానదు. ఈ వినూత్న ఆలోచనే అతడి జీవితాన్ని మార్చేసింది. ఇక అన్నాదురై 9 భాషల్లో తన కస్టమర్లను పలకరిస్తాడు. వారితో ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. ఇన్ని హైటెక్ హంగులతోపాటు.. కస్టమర్లను దైవంగా భావిస్తున్న అన్నాదురై ఆటో అంటే ఆ ప్రాంతంలో స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఒక్కసారి అతడి ఆటో ఎక్కిన వారు.. మళ్లీ మళ్లీ దానిలోనే ప్రయాణం చేయాలని కోరుకుంటారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేలో జూల్ 15న పోస్ట్ చేసిన అన్నాదురై స్టోరీ ఎందరినో ఆకట్టుకుంటుంది. ఇప్పటికే 1.3 మిలియన్ల కన్నా ఎక్కువ మంది దీన్ని వీక్షించారు. అన్నాదురై వినూత్న ఆలోచనపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
చల్లటి వాగ్దానం
సాక్షి, చెన్నై: ఎండలు మండుతున్న వేళ ‘అమ్మ’ చల్లటి వాగ్దానం ఇవ్వడానికి సిద్ధం అవుతోన్నారట! అదే ఉచితం...! అవే మహిళల కోసం అమ్మ మినీ ఫ్రిడ్జ్, వాటర్ హీటర్. ఇదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. డీఎంకే ఉచితాలకు దూరంగా ఉండడంతో, జనాకర్షణ దిశగా ఈ చల్లటి వాగ్దానం అందుకునేందుకు అమ్మ నిర్ణయించినట్టుగా సంకేతాలు వస్తుండడం గమనించాల్సిందే. రాష్ట్రంలో ఎన్నికల వాగ్దానాలుగా రాజకీయపక్షాలు ఉచిత పథకాలను ప్రకటిస్తున్నాయి. డీఎంకే హయంలో టీవీ ఇవ్వగా, అన్నాడీఎంకే సర్కారు మిక్సీ, గ్రైండర్, ఫ్యాన్లను పంపిణీ చేసింది. అయితే ఈ ఉచితాల్ని విమర్శించే వాళ్లూ ఎక్కువే. ఎన్నికల యంత్రాంగం సైతం ఉచితాలకు దూరంగా ఉంటే బాగుంటుందంటూ రాజకీయ పక్షాలకు సూచించే పనిలో పడింది. ఇందుకు డీఎంకే తలొగ్గినట్టుంది. అందుకే ఈ సారి తమ మేనిఫెస్టోలో ఉచితాల్ని పక్కన పెట్టి, రుణాల మాఫీలతో పాటుగా కొత్త అంశాల్ని తెర మీదకు తెచ్చింది. పీఎంకే కూడా ఉచితాల జోలికి వెళ్లకుండా మేనిఫెస్టోను ప్రకటించింది. ఇక, రాష్ర్టంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఇంత వరకు మేనిఫెస్టోను ప్రకటించ లేదు. అందరి కన్నా ముందు ఉండే అమ్మ జయలలిత ఈ సారి ఆలస్యంగానైనా ఆలోచనాత్మకంగా వ్యవహరించి సరికొత్త అంశాలతో ముందుకు వచ్చేందుకు చర్యలు వేగవంతం చేసి ఉన్నారు. ఇందులో మండే ఎండలకు చల్లటి వాగ్దానంగా అమ్మఫ్రిడ్జ్, వాతావరణం మారగానే చలికాలంలో వెచ్చటి నీళ్ల కోసం హీటర్ అందించేందుకు తగ్గ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సమాచారం కాస్త బయటకు రావడంతో అందరి దృష్టి అమ్మ మేనిఫెస్టోపై మరలి ఉంది. ఇంతకీ ఈ చల్లటి వాగ్దానం అందులోఉంటుందా? అని ఎదురు చూపులు పెరిగాయి. ఓట్ల కోసం నోట్ల పంపిణీకి ఈసీ అడ్డు పడుతున్న నేపథ్యంలో ఈ ఉచితాన్ని ప్రకటించే అవకాశాలు ఎక్కువే. ఇందుకు నిదర్శనంగా అన్నాడీఎంకే వర్గాల్ని టార్గెట్ చేసి జరుగుతున్న దాడుల్లో కట్టల కట్టలుగా నోట్లు బయట పడుతుండడమే..!