న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం రిలయన్స్ రిటైల్ స్థానికంగా బొమ్మల తయారీలోకి ప్రవేశించనుంది. బొమ్మలకు పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా హర్యానా కంపెనీ సర్కిల్ ఈ రిటైల్‌తో భాగస్వామ్యానికి తెరతీసింది. తద్వారా బొమ్మల బిజినెస్‌లో సమీకృత కార్యకలాపాలను నిర్వహించే ప్రణాళికల్లో ఉన్నట్లు రిలయన్స్ రిటైల్ సీఎఫ్‌వో దినేష్ తలుజా పేర్కొన్నారు.
కంపెనీ ఇప్పటికే సుప్రసిద్ధ బ్రిటిష్ బొమ్మల బ్రాండ్ హామ్లేస్‌తోపాటు, దేశీ బ్రాండు రోవన్ విక్రయాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బొమ్మల బిజినెస్‌లో డిజైన్ నుంచి షెల్ఫ్‌వరకూ రిలయన్స్ రిటైల్ వ్యూహాత్మకంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. వెరసి బొమ్మల డిజైనింగ్, తయారీ, రిటైల్ మార్కెటింగ్ తదితరాలను చేపట్టడం ద్వారా టాయ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment