
పసిహృదయాల మనస్సులు ఎంతో నిర్మలంగా, అమాయకంగా ఉంటాయి. అంతేకాదు వాళ్లు తమ స్నేహితులు బాధపడుతుంటే పెద్దవాళ్ల కంటే వాళ్లే ఎక్కువగా చొరవ తీసుకుని భలే ఊరడిస్తారు. వాళ్లు ఒకరికొకరు వారికి తోచిన రీతిలో గిఫ్ట్‌లు ఇచ్చుకుంటూ భలే సరదాగా గడుపుతుంటారు. అచ్చం అలాగే ఇక్కడోక విద్యార్థి విషయంలో జరిగింది. అసలు ఎక్కడ ఏం జరిగిందో చూద్దాం రండి.
(చదవండి: చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!)
అసలు విషయంలోకెళ్లితే.....తమ స్నేహితుడి ఇల్లు అనుకోని ప్రమాదంలో కాలిపోతుంది. దీంతో అతని తోటి స్నేహితులు అతని బాధను మర్చిపోయాలా అతని మంచి సర్‌ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటారు. అంతే తమ స్నేహితుడు క్లాస్‌రూంలోకి రాగానే వారంతా కొత్త కొత్త బొమ్మలను గిఫ్ట్‌గా ఇస్తారు. అంతేకాదు "ఇదంతా నీకోమే రా", "ఇవన్నీ నీకే" అంటూ అందరూ రకరకలా బొమ్మలతో క్లాస్ రూమ్‌ని నింపేస్తారు.
దీంతో ఆ విద్యార్థి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి 'వావ్' అని గట్టిగా అరిచి ఆనందంగా వారిని కౌగిలించుకోవటానికీ రెండు చాతులు చాపుతాడు. దీంతో అతని స్నేహితులంతా ఒకేసారి అతన్ని కౌగిలించుకోవటానికి ఎగబడతారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను స్కూల్ డిస్ట్రిక్ట్ ఫిలడెల్ఫియా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు ఈ వీడియో చూస్తే ఎవరి హృదయం అయినా ద్రవించిపోతుంది అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
(చదవండి: వాట్ ఏ ఎక్స్‌ప్రెషన్స్...ఎవ్వరికైనా నవ్వు రావల్సిందే....)
Comments
Please login to add a commentAdd a comment