స్నేహితుడి పెళ్లిలో చీరకట్టుతో మెరిసిన అమెరికన్స్‌.. ఎంత సక్కగున్నారో! | Viral Video: Two US Men Show Up At Indian Best Friend Wedding Wearing Sarees | Sakshi
Sakshi News home page

Viral Video: స్నేహితుడి పెళ్లిలో చీరకట్టుతో మెరిసిన అమెరికన్స్‌.. ఎంత సక్కగున్నారో!

Published Thu, Nov 17 2022 4:15 PM | Last Updated on Thu, Nov 17 2022 5:30 PM

Viral Video: Two US Men Show Up At Indian Best Friend Wedding Wearing Sarees - Sakshi

సాధారణంగా ఎవరైనా పెళ్లికి వెళ్తే ఏం చేస్తారు.. మంచిగా తయారయ్యి గిఫ్ట్‌లు, డబ్బులు కానుకలుగా తీసుకెళ్తారు. పెళ్లయ్యాక భోజనం చేసి వచ్చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్‌ మారింది. చాలా వరకు పెళ్లిల్లో  బంధువులు, స్నేహితులు సర్‌ప్రైజ్‌లు ప్లాన్‌ చేస్తున్నారు.  వధూవరులతో ఫ్రెండ్స్ చేసే అల్లరి పనులు, సర్‌ప్రైజ్‌లు  భలే ఫన్నీగా ఉంటాయి.  తాజాగా ఓ ఇద్దరు యువకులు తమ బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లికి ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. పెళ్లి భారతీయ యువకుడిదే అయినా జరిగింది ఇక్కడ కాదు అమెరికాలో.. అయితే అతన్ని సర్‌ప్రైజ్‌ చేసింది అమెరికా దోస్తులు కావడం విశేషం.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇండియాకు చెందిన ఓ యువకుడు చికాగోలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. పంచెకట్టులో ముస్తాబైన వరుడు తన స్నేహితుల కోసం ఎదురుస్తున్నాడు. ఇంతలో తన బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయిన ఇద్దరు అమరికన్‌ యువకులు అచ్చమైన భారత మహిళలుగా చీర కట్టుకొని అటుగా వస్తుంటారు. చక్కగా చీరలు కట్టుకొని ముఖానికి బొట్టు పెట్టుకొని.. ఇద్దరు కలిసి రోడ్డుపై వయ్యారంగా సిగ్గుపడుతూ నడుస్తూ వచ్చారు.

దోస్తుల కోసం ఎదురు చూస్తున్న వరుడు వారు అలా చీరలో స్టైల్‌గా వస్తుండటం చూసి ఒక్కసారిగా షాక్‌ అవుతాడు. గాల్లో తేలిపోయి పడిపడి నవ్వుతుంటాడు. స్నేహితులు సైతం వరుడిని ఆనందంతో చిరునవ్వు చిందిస్తారు. చివరికి ముగ్గురు ఒకరినొకరు హత్తుకొని తమ స్నేహానికి గుర్తుగా ఓఫోటో ఫోజు ఇచ్చారు. ఇదంతా వధువు పక్కకు ఉండి వారిని గమనిస్తూ మురిసిపోవడంపై మరింత హెలైట్‌గా నిలిచింది. 
చదవండి: విమానం టేక్‌ అఫ్‌ టైంలో ఫోన్‌ మిస్సింగ్‌.. పైలెట్‌ కిటికిలోంచి వంగి మరీ..


 
చికాగోకు చెందిన ఓ వెడ్డింగ్‌ఫోటోగ్రాఫ్‌ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో భారతీయ సంప్రదాయమైన చీరను కట్టడంలో యువకులకు ఓ మహిళ సాయం చేసింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్నేహితుడి సంప్రదాయాన్ని గౌరవించి యువకులు తీసుకున్న నిర్ణయం నెటిజన్ల మనసులను హత్తుకుంటుంది. నిజమైన స్నేహితులు వీళ్లు అంటూ యువకులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప‘రాయి దేశం వాళ్లు అయిన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో విలువిచ్చారో, ఎంత ముద్దుగా చీరలు కట్టుకున్నారో.. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు’ అంటూ కొనియాడుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement