సోషల్‌మీడియాలోని నెటిజన్లకు ఎప్పుడు ఏ కంటెంట్ నచ్చుతుందో చెప్పలేం. అయితే నెట్టింట ఇటీవల వధువు, వరుడు డ్యాన్స్ వీడియోలు మాత్రం ఎక్కువగా వైరల్‌గా మారతున్న సంగతి తెలిసిందే. దీంతో పెళ్లి మండపంలో చేసిన డ్యాన్స్ వీడియోలు నెట్టింట నిండిపోతున్నాయి. పైగా ఈ రోజుల్లో పెళ్లంటే డ్యాన్స్ కంపల్సరీ అయిపోయింది. ఇందులో కొందరు మాత్రం తమ స్టెప్పులతో ప్రోషెషనల్ డ్యాన్స్‌ర్లను తలపిస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ( చదవండి: ఎంబీఏ చదవలేకపోయాడు.. టీ కొట్టుతో కోట్లు సంపాదించాడు.. )
తాజాగా ఓ పెళ్లిలో వధువు చేసిన డ్యాన్స్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వధువు బాలీవుడ్ మూవీలోని ‘పప్పు క్యాన్ట్ డ్యాన్స్ సాలా’ పాటకి తన స్నేహితులతో కలిసి స్టెప్పులేసింది. ఆ వీడియోను కొరియోగ్రాఫర్ మహిమ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వధువు డ్యాన్స్‌తో పాటు తన ఎక్స్‌ప్రెషన్స్‌కి ఫిదా అవుతున్నారు. కొందరు ఆమె డ్యాన్స్‌కి ఫ్యాన్స్‌గా మారిపోయమని, మరికొందరు వావ్ వాట్ ఏ డ్యాన్స్ అని కామెంట్లు పెడుతున్నారు
చదవండి: టీవీ నటుడికి షాకిచ్చిన ఫ్లిప్‌కార్ట్.. ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే!
Comments
Please login to add a commentAdd a comment