కండల వీరుడి కళాపోషణ! | The muzzle of the art nutrition! | Sakshi
Sakshi News home page

కండల వీరుడి కళాపోషణ!

Published Wed, Jun 17 2015 11:24 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

కండల వీరుడి కళాపోషణ!

కండల వీరుడి కళాపోషణ!

కండల వీరుడు సల్మాన్ ఖాన్‌లో మంచి నటుడే కాదు.. మంచి చిత్రకారుడూ ఉన్నాడు. వీలు చిక్కినప్పుడల్లా కుంచె చేతబట్టి తనకు నచ్చిన బొమ్మలు గీస్తుంటారు. తాజాగా, ఆయన ఓ బొమ్మ గీశారు. ప్రేమ మైకంలో ఉన్న అందమైన జంట బొమ్మ అది.
 
 ఇప్పుడు సల్మాన్ ఆ బొమ్మ గీయడానికి కారణం లేకపోలేదు. కరీనాకపూర్‌తో కలిసి ఆయన నటించిన ‘భజరంగీ భాయ్‌జాన్’ త్వరలో విడుదల కానుంది. ఇందులో సల్మాన్, కరీనా మధ్య అందమైన లవ్‌స్టోరీ ఉంది.
 
 దాన్ని ఉద్దేశించి ఈ బొమ్మకు ‘భజరంగీ భాయ్‌జాన్’ అని పేరు పెట్టి, ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ బొమ్మను చూసినవాళ్లు ‘సల్మాన్ ఎంత మంచి చిత్రకారుడో’ అని అభినందించకుండా ఉండలేకపోయారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement