
సాక్షి, బెంగళూరు: మొదటి సారిగా భారత పర్యటనకు వచ్చిన భూటాన్ రాజ దంపతుల కుమారునికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటకకు చెందిన ప్రముఖ హస్తకళాకృతుల్లో ఒకటైన చెన్నపట్టణ బొమ్మలను అందజేశారు.
భూటాన్ రాజు జిగ్మే నామ్‌గల్ వాంగ్‌చుక్ తన భార్యా, ఏడాదిన్నర వయస్సున్న కుమారుడితో భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భూటాన్ రాజ దంపతులతో సమావేశమైన నిర్మలా సీతారామన్ యువరాజుకు ఒక కుందేలు బొమ్మతో పాటు కొన్ని చెన్నపట్టణ బొమ్మలను బహుమతిగా అందజేశారు. యువరాజుకు అందజేసిన బొమ్మలు రాజదంపతులను ఆకట్టుకున్నాయంటూ నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.
చెన్నపట్టణ బొమ్మలతో ఆడుకుంటున్న బుల్లి యువరాజు