ధోనీ న్యూ లుక్... ద జార్‌హెడ్ | Dhoni gets New Hairstyle for Australia Series | Sakshi
Sakshi News home page

ధోనీ న్యూ లుక్... ద జార్‌హెడ్

Published Sat, Dec 6 2014 8:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

ధోనీ న్యూ లుక్... ద జార్‌హెడ్

ధోనీ న్యూ లుక్... ద జార్‌హెడ్

ప్రయోగాలు చేయటంలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ముందుంటాడు. క్రికెట్ లోనే  కాదండోయ్...తన జట్టు మీద కూడా. సీజన్కు తగ్గట్టు మనోడు... హెయిర్ స్టైల్ను ఈజీగా మార్చేస్తుంటాడు. ఒకప్పుడు పొడవాటి జట్టుతో  అప్పటి పాక్ అధ్యక్షుడు ముషరాఫ్ను ఆకర్షించిన ధోని తాజాగా మరో అవతారం ఎత్తాడు.

గాయం కారణంగా శ్రీలంకతో వన్డే సిరీస్కు దూరంగా ఉన్న మహేంద్రుడు.. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు హెయిర్ స్టైల్ను డిఫరెంట్గా మార్చాడు.  ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండీ లుక్తో కనిపించే  ధోని ఈసారి సరికొత్త హెయిర్ స్టైల్లో దర్శనమిచ్చాడు. తాజా హెయిర్‌ స్టయి ల్‌లో చెవులపై భాగంతో పాటు తల వెనుక భాగంలోనూ వెంట్రుకలను బాగా ట్రిమ్‌ చేశాడు. దీన్ని 'ద జార్‌హెడ్‌' లేదా 'ద హై అండ్‌ టైట్‌' అంటారు.

దుస్తుల్లాగే ... జుట్టుతోనూ ధోని రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. గతంలో ధోనీ  హెయిర్ స్టయిల్ అభిమానులకు విశేషంగా నచ్చి, దాన్ని అనుకరించారు కూడా. మరి తమ ఫేవరెట్ క్రికెటర్.. తాజా హెయిర్ స్టయిల్ అభిమానులను ఏవిధంగా ఆకర్షిస్తుందో చూడాలి మరి.


(గతంలో ధోనీ హెయిర్ స్ట్రయిల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement