
హైదరాబాద్: గ్లోబల్ టెక్నాలజీ సంస్థ డైసన్ హెయిర్ కేర్ టెక్నాలజీస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా నటి దీపికా పదుకొనేను నియమించుకుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికి శిరోజాల సంరక్షణపై కనీస అవగాహన అవసరం.
ఆరోగ్యకరమైన హెయిర్ స్టైల్ కోసం ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలను చేస్తున్న డైసన్‌కు బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తుండటం సంతోషంగా ఉందని దీపికా అన్నారు. ‘‘మా బ్రాండ్‌కు దీపికా మరింత గుర్తింపు తీసుకొస్తుంది. అధునాతన కేశాలంకరణ పరికరాల మార్కెట్‌ను మరింత విస్తరించుకునేందుకు ఆమెకు ఉన్న ఆకర్షణ మాకు కలిసొస్తుంది’’ అని డైసన్ ఇండియా ఎండీ అంకిత్ జైన్ తెలిపారు.