
చేతిలో వైన్ గ్లాస్. డిఫరెంట్ హెయిర్ స్టైల్. కోపంగా చూస్తున్న చూపు... తెలుగు సినిమాల్లో కనిపించనంత డిఫరెంట్‌గా సిద్ధార్థ్ కనిపిస్తున్నారు కదూ. మలయాళ సినిమా ‘కమ్మార సంభవం’లో సిద్ధూ ఇలా కనిపించనున్నారు. మాలీవుడ్‌లో ఆయనకిది మొదటి సినిమా. రతిష్ అంబత్ దర్శకత్వంలో దిలీప్ కుమార్, సిద్ధార్థ్ ముఖ్య తారలుగా రూపొందుతున్న సినిమా ఇది.
గత నెల ఈ సినిమాలోని దిలీప్ లుక్‌ను రిలీజ్ చేసిన చిత్రబృందం ఇప్పుడు íసిద్ధార్థ్ లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘దిస్ ఈజ్ మోస్ట్ స్పెషల్ పొంగల్. నేను నటిస్తున్న ఫస్ట్ మలయాళం సినిమా ‘కమ్మార సంభవం’లో నా లుక్ రిలీజ్ అయ్యింది. రితిష్ అంబత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మురళీగోపీ కథ రాశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను’’ అని పేర్కొన్నారు సిద్ధార్థ్.
Comments
Please login to add a commentAdd a comment