కాజల్ అగర్వాల్.. గ్లామర్ సిగ్నేచర్. సంప్రదాయ కట్టైనా .. మోడర్న్ అవుట్‌ఫిట్ అయినా కట్టిన వాటికే వన్నె తెచ్చే స్ట్రక్చర్ ఆమెది. అందుకే సిల్వర్ స్క్రీన్‌కే కాదు ఫ్యాషన్ ప్రపంచానికీ ఆమె మోస్ట్ వాంటెడ్. ఈ స్టార్ స్టైల్‌ను పెంచే ఆ బ్రాండ్స్ ఏంటో చూద్దామా?
బ్రాండ్ వాల్యూ
నికిత మైసల్కర్... భారతీయ ఫ్యాషన్ డిజైనర్లలో ప్రముఖురాలు. 2003, అహ్మదాబాద్‌లో ముగ్గురు స్నేహితులతో కలిసి ‘నికిత మైసల్కర్’ అని తన పేరు మీదే చిన్న సంస్థను ప్రారంభించింది. ప్రస్తుతం అది ఓ వస్త్ర పరిశ్రమగా స్థిరపడింది. దేశవ్యాప్తంగా 57 స్టోర్లున్నాయి. ఈ డిజైనర్ డ్రెస్‌లకు అన్‌లైన్‌లోనూ డిమాండ్ ఉంది. డిజైన్‌ను బట్టే ప్రైజ్. అదే ఈ బ్రాండ్ వాల్యూ. ఓ వైపు ఈ సంస్థను నిర్వహిస్తూనే మరో వైపు ఫ్యాషన్ డిజైనింగ్ తరగతులనూ బోధిస్తోంది నికిత మైసల్కర్.
ఇయరింగ్స్
బ్రాండ్: ఓలియో జ్యూయెలర్స్ ఎథీనా హూప్స్ మిస్ మ్యాచ్డ్
ధర: రూ. 8,200
హీల్స్
బ్రాండ్: బ్రాండ్: సమ్‌థింగ్ ఐ బ్లష్ పింక్ హై హీల్స్
ధర: రూ. 7,000
డ్రస్
బ్రాండ్: నికిత మైసల్కర్ సీక్విన్ ఎంబ్రాయిడరీ స్లిట్ స్కర్ట్
ధర: రూ. 47,000
ఓలియో జ్యూయెలర్స్.. అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన దేశీ బ్రాండ్ ఇది. ఆష్నా సింగ్, స్నేహా సక్సెనా అనే ఇద్దరు స్నేహితులు కలసి 2015లో దీన్ని లాంచ్ చేశారు. సెలబ్రిటీస్ ఫేవరేట్ బ్రాండ్ జ్యూయెలరీ ఇది. 18 క్యారెట్ల బంగారు నాణ్యతతో లభించే ఈ యాంటిక్ డిజైన్ ఆభరణాలను హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ప్రతీ హీరోయిన్ ఒక్కసారి అయినా ధరించి ఉంటుంది. వీటి ధర కూడా ఆకాశంతో పోటీ పడుతూంటుంది. గోల్డ్ రేట్‌తో సంబంధం లేదు వీటికి. డిజైన్ ఓన్లీ మ్యాటర్స్. దాన్ని బట్టే ప్రైస్. ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటాయి.
సమ్‌థింగ్ ఐ.. స్త్రీల కోసమే పాదరక్షలు తయారు చేసే భారతీయ కంపెనీ. సంప్రదాయానికి లేటెస్ట్ ట్రెండ్‌ను జత చేస్తూ డిజైనర్ జోళ్లను రూపొందించడం దీని యూఎస్‌పి (యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్). కేవలం ఆన్‌లైన్ మార్కెట్‌లో మాత్రమే లభించే ఈ ఫుట్‌వేర్.. సరసమైన ధరల్లోనే లభిస్తాయి.
'రెడీ అవ్వడం అన్నా.. రెడీ చెయ్యటం అన్నా చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా చెల్లికి డబ్బులిచ్చి మరీ హెయిర్ స్టయిలింగ్ చేసేదాన్ని.'
– కాజల్ అగర్వాల్.
Comments
Please login to add a commentAdd a comment