మన సీతామహాలక్ష్మేనా! | different hair styles for girls | Sakshi
Sakshi News home page

మన సీతామహాలక్ష్మేనా!

Published Wed, Aug 28 2013 11:29 PM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

మన సీతామహాలక్ష్మేనా!

మన సీతామహాలక్ష్మేనా!

చీరకట్టినా, చుడీదార్ వేసుకున్నా
 సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మే.
 తేడా ఏం కొట్టదు.
 అదే... హెయిర్ స్టయిల్ మార్చమనండి...
 ‘మన సీతామహాలక్ష్మేనా!’ అని చూస్తాం.
 వేసిన ముడి
 తీసిన పాపిడి
 తిప్పిన మెలిక
 విప్పిన పాయ
 ఎవ్రీథింగ్... ఎ న్యూ లుక్!
 స్ట్రెయిట్ హెయిర్ అయితేనా...
 ఇక చెప్పడానికేం లేదు.
 తల తిప్పనివ్వని చూపులే...
 మీ కురులలోని పువ్వులు!

 
 పట్టుకుంటే పట్టులా, ముట్టుకుంటే మృదువుగా జారిపోయే తీరు సాఫ్ట్ హెయిర్ సొంతం. జడ అల్లినా, వదిలేసినా అందంగా కనిపించే ఈ జుట్టు ఉన్నవారు రకరకాల హెయిర్ స్టైల్స్‌పై ముచ్చటపడినా త్వరగా సెట్ కాక, చిరాకుపడుతుం టారు. మరికొన్ని స్టైల్స్ ట్రై చేస్తే బాగుంటుంది అనుకునే సాఫ్ట్ అండ్ స్ట్రెయిట్ హెయిర్ గలవారు నిమిషంలోనే అల్లేసుకునే హెయిర్ స్టైల్స్‌లో కొన్ని ఇవి.
 
 రివర్స్ పోనీటెయిల్:

చిక్కుల్లేకుండా దువ్వుకోవాలి, జుట్టును పైనంతా ఒక చేతిలోకి తీసుకొని, మరో చేత్తో రెండు సార్లు మెలిక తిప్పి, పైకి మడిచి, క్లిప్ పెట్టాలి. పైన కాక్‌టెయిల్‌లాగ వస్తుంది. ఈ క్యాజువల్ హెయిర్ స్టైల్ మోడ్రన్ డ్రెస్సులకు సూటవుతుంది.
 
 సైడ్ ఫ్రెంచ్‌ప్లాట్:

ఎడమ, కుడి ఏదో ఒక వైపుకు జుట్టు దువ్వి, వీలైనన్ని పాయలు తీసుకుంటూ జడ అల్లాలి. ఫిష్‌టెయిల్‌లా వచ్చే ఈ స్టైల్ ప్యాంట్‌షర్ట్, మిడీస్.. వంటి మోడ్రన్ డ్రెస్సులకే కాదు గాగ్రా, లంగాఓణీ మీద కూడా అందంగా ఉంటుంది.
 
 సైడ్ జడ:

కుడి లేదా ఎడమ. ఏదో ఒకవైపు జడ అల్లుకోవాలి. అయితే పూర్తిగా జడ కాకుండా కొంత జుట్టు వదిలేసి రబ్బర్‌బ్యాండ్ పెట్టుకోవాలి. వీలైతే ఫ్రెంచ్ ప్లాట్ కూడా ఇలాగే వేసుకోవచ్చు. ఈ స్టైల్ ప్యాంట్‌షర్ట్, మిడీస్.. మోడ్రన్ డ్రెస్సులకే కాదు గాగ్రా, లంగాఓణీ మీద కూడా అందంగా ఉంటుంది.
 
 సింగిల్ ఫ్రెంచ్ ప్లాట్:

నాలుగు నుంచి ఎనిమిది పాయలు తీసుకుంటూ పై నుంచి జడ అల్లాలి. దీనికి చిన్న చిన్న హెయిర్ బీడ్స్ అలంకరిస్తే మరింత అందంగా ఉంటుంది. ఈ స్టైల్ సంప్రదాయ తరహా దుస్తుల మీదకు బాగుంటుంది.
 
 నెం.8 స్టైల్:

 జుట్టును చివరి వరకు మెలితిప్పి, పైకి రెండుసార్లు మడిచి, మధ్యలో క్లిప్ పెట్టాలి. నెం.8ను పోలినట్టుగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు. ఈ హెయిర్‌స్టైల్ చీరకట్టుకి ఇంటబయటా అందంగా ఉంటుంది. రిలీఫ్‌గా కూడా అనిపిస్తుంది.
 
 హెయిర్ స్టైలిస్ట్: శాంతి, సాక్షి టీవీ
 ఫొటోలు: శివ మల్లాల

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement