Sita Mahalakshmi
-
రమేష్ ఆస్పత్రిలో డీఎంహెచ్‌వో తనిఖీలు
-
విజయవాడ రమేష్ ఆస్పత్రిలో తనిఖీలు
సాక్షి, విజయవాడ: నగరంలోని రమష్ ఆస్పత్రిలో శుక్రవారం డీఎంహెచ్‌వో (జిల్లా వైద్యఆరోగ్య శాఖ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వివిధ విభాగాల్లోని మెడికల్ పరికరాలను అధికారులు పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. పాయకరావుపేట రాజీవ్ నగర్‌కు చెందిన ఆసుల సీతామహాలక్ష్మి అనే మహిళకు జ్వరం రావడంతో ఆమె కుటుంబసభ్యులు గత ఏడాది ఆగస్ట్ 31న బందర్‌రోడ్‌లోని రమేష్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు స్వైన్ ఫ్లూ ఉందంటూ నివేదిక ఇచ్చారు. రెండు రోజుల అనంతరం కుటుంబసభ్యులు...మహిళను గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్చించారు. వైద్య పరీక్షల అనంతరం సీతా మహాలక్ష్మికి స్వైన్ ఫ్లూ లేదని ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చారు. జరిగిన తప్పిదంపై మహిళ కుటుంబీకులు అప్పట్లో రమేష్ ఆస్పత్రి సీఈవోను కలిసి ఈ ఘటనపై వివరణ అడిగారు. స్పైన్ ఫ్లూ ఉందని చికిత్స కోసం రూ.52 వేలు వసూలు చేశారని ప్రశ్నించగా, తాము చేయాల్సిన పని చేశామని తమ తప్పు లేదని సీఈవో చెప్పడంతో జరిగిన తప్పిదంపై బాధిత మహిళ కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే పోలీసులు కూడా స్పందించకపోవడంతో కమిషనర్‌ను కలిసి తమ ఆవేదన తెలిపారు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో తమకు సరైన వైద్యం చేయకుండా ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం గా వ్యవహరించారని సీతామహాలక్ష్మి కుమారుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణకు ఆదేశించడంతో డీఎంహెచ్‌వో రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. -
జూన్ నుంచి బిజీ బిజీగా!
లైవ్ వైర్‌కి చిరునామా అన్నట్లుగా ఉంటారు మంచు మనోజ్. సినిమాల్లోనే కాదు.. విడిగా కూడా చాలా జోష్‌గా ఉంటారు. ‘మేజర్ చంద్రకాంత్’లో బాల నటుడిగా ఆకట్టుకున్న మనోజ్ ‘దొంగ దొంగది’ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వెరైటీ పాత్రలు చేస్తూ ‘రాకింగ్ స్టార్’ అనిపించుకున్నారు. ఇప్పటి వరకూ దాదాపు పదిహేను చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. నేడు మనోజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను చేయనున్న మూడు చిత్రాలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ప్రసన్న దర్శకత్వంలో ‘సీతా మహాలక్ష్మి’ అనే చిత్రంలో, క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మించనున్న చిత్రంలో, అజయ్ అండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్ఎన్ రెడ్డి, ఎన్. లక్ష్మీకాంత్ తెరకెక్కించే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రాలు జూన్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి. -
వీఆర్వో, వీఆర్ఏ ఫలితాలు విడుదల
జిల్లా టాపర్లు సీతామహాలక్ష్మి, గోపాలరావు 1 : 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు 27న సర్టిఫికెట్ల పరిశీలన మెరిట్ లిస్ట్ నేడో, రేపో మచిలీపట్నం, న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పరీక్షా ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి శనివారం విడుదలృచేశారు. ఈ నెల రెండున ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం వంద మార్కులకు జరిగిన వీఆర్వో పరీక్షల్లో గంపలగూడెం మండలం నెమలి గ్రామానికి చెందిన సీహెచ్ సీతామహాలక్ష్మి 96 మార్కులతో, వీఆర్ఏ పరీక్షల్లో ఎ.కొండూరు మండలం చీమలపాడుకు చెందిన గుండ్రు గోపాలరావు 92 మార్కులతో జిల్లా టాపర్లుగా నిలిచారు. గోపాలరావు వీఆర్వో పరీక్షలోనూ 92 మార్కులతో 40వ స్థానంలో నిలిచాడు. వీఆర్వో పరీక్షలో పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన ఎం.గోపాలకృష్ణ (95 మార్కులు), ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన అల్లాడ నళినికుమార్ (95 మార్కులు), అవనిగడ్డకు చెందిన కమ్మిలి హరిబాబు (94 మార్కులు), గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన బొద్దుల నాగరాజు (94 మార్కులు) సాధించి మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు. వీఆర్ఏ పరీక్ష ఫలితాల్లో మచిలీపట్నం మండలానికి చెందిన ముదినేని గాయత్రిదేవి (91 మార్కులు), ఎ.కొండూరు చీమలపాడుకు చెందిన నన్నెబోయిన గోపీకృష్ణ (91 మార్కులు), కోడూరు మండలం విశ్వనాథపల్లికి చెందిన సీహెచ్ వెంకటనారాయణ (91 మార్కులు), జగ్గయ్యపేట మండలం అన్నవరం దాచేపల్లి రమేష్ (91 మార్కులు), జగ్గయ్యపేట మండలం అన్నవరానికి చెందిన దాచేపల్లి శ్రీను (91 మార్కులు)తో తర్వాతి స్థానాలు సాధించారు. ర్యాంకుల ఆధారంగా ఇంటర్వ్యూలు... జిల్లాలో ఖాళీగా ఉన్న 64 వీఆర్వో, 403 వీఆర్ఏ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 2న పరీక్షలు నిర్వహించారు. వీఆర్వో పరీక్షకు 59,024 మంది దరఖాస్తు చేసుకోగా 52,119 మంది, వీఆర్ఏ పరీక్షకు 7,542 మంది దరఖాస్తు చేసుకోగా 6,684 మంది హాజరయ్యారు. అభ్యర్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తామని రెవెన్యూ అధికారులు తెలిపాయి. ఈ నెల 27 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీకే మహంతి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా వీఆర్వో, వీఆర్ఏ మెరిట్ జాబితాలను శనివారం కలెక్టర్లకు పంపించిన ఆయన ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై పలు సూచనలు చేశారు. ఆన్లైన్ వ్యవస్థను పటిష్టంగా ఉపయోగించుకుని పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. నేడో, రేపో మెరిట్ లిస్ట్... రాష్ట్రంలోని వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీలో భాగంగా ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా భర్తీ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని పోస్టులు, అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల వారీగా మెరిట్ లిస్టును ఆది, సోమవారాల్లో ప్రకటించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అనంతరం పోస్టుల భర్తీ ప్రక్రియ ఇలా ఉంటుంది. జిల్లాలో 64 వీఆర్వో పోస్టులు ఉండగా వాటిలో ఓపెన్ కేటగిరీలో 18 పోస్టులు, ఓసీ మహిళా కోటాలో 9, ఎస్సీలకు 5, ఎస్సీ మహిళ 3, ఎస్టీలకు 2, ఎస్టీ మహిళలకు 2, బీసీ-ఏ 4, బీసీ-ఏ మహిళలకు 1, బీసీ-బీ 4, బీసీ-బీ మహిళలకు 3, బీసీ-సీ 1, బీసీ-డీ 3, బీసీ-డీ మహిళలు 2, బీసీ-ఈ 2, బీసీ-ఈ మహిళకు 1, మాజీ సైనికుల కోటాలో 2, ఓసీ వీహెచ్ 1, ఓసీ ఓహెచ్ 1 చొప్పున పోస్టులను కేటాయించారు. వీఆర్ఏల భర్తీ ప్రక్రియ మండలాలవారీగా నిర్వహిస్తారు. -
మన సీతామహాలక్ష్మేనా!
చీరకట్టినా, చుడీదార్ వేసుకున్నా సీతామహాలక్ష్మి సీతామహాలక్ష్మే. తేడా ఏం కొట్టదు. అదే... హెయిర్ స్టయిల్ మార్చమనండి... ‘మన సీతామహాలక్ష్మేనా!’ అని చూస్తాం. వేసిన ముడి తీసిన పాపిడి తిప్పిన మెలిక విప్పిన పాయ ఎవ్రీథింగ్... ఎ న్యూ లుక్! స్ట్రెయిట్ హెయిర్ అయితేనా... ఇక చెప్పడానికేం లేదు. తల తిప్పనివ్వని చూపులే... మీ కురులలోని పువ్వులు! పట్టుకుంటే పట్టులా, ముట్టుకుంటే మృదువుగా జారిపోయే తీరు సాఫ్ట్ హెయిర్ సొంతం. జడ అల్లినా, వదిలేసినా అందంగా కనిపించే ఈ జుట్టు ఉన్నవారు రకరకాల హెయిర్ స్టైల్స్‌పై ముచ్చటపడినా త్వరగా సెట్ కాక, చిరాకుపడుతుం టారు. మరికొన్ని స్టైల్స్ ట్రై చేస్తే బాగుంటుంది అనుకునే సాఫ్ట్ అండ్ స్ట్రెయిట్ హెయిర్ గలవారు నిమిషంలోనే అల్లేసుకునే హెయిర్ స్టైల్స్‌లో కొన్ని ఇవి. రివర్స్ పోనీటెయిల్: చిక్కుల్లేకుండా దువ్వుకోవాలి, జుట్టును పైనంతా ఒక చేతిలోకి తీసుకొని, మరో చేత్తో రెండు సార్లు మెలిక తిప్పి, పైకి మడిచి, క్లిప్ పెట్టాలి. పైన కాక్టెయిల్లాగ వస్తుంది. ఈ క్యాజువల్ హెయిర్ స్టైల్ మోడ్రన్ డ్రెస్సులకు సూటవుతుంది. సైడ్ ఫ్రెంచ్ప్లాట్: ఎడమ, కుడి ఏదో ఒక వైపుకు జుట్టు దువ్వి, వీలైనన్ని పాయలు తీసుకుంటూ జడ అల్లాలి. ఫిష్టెయిల్లా వచ్చే ఈ స్టైల్ ప్యాంట్‌షర్ట్, మిడీస్.. వంటి మోడ్రన్ డ్రెస్సులకే కాదు గాగ్రా, లంగాఓణీ మీద కూడా అందంగా ఉంటుంది. సైడ్ జడ: కుడి లేదా ఎడమ. ఏదో ఒకవైపు జడ అల్లుకోవాలి. అయితే పూర్తిగా జడ కాకుండా కొంత జుట్టు వదిలేసి రబ్బర్‌బ్యాండ్ పెట్టుకోవాలి. వీలైతే ఫ్రెంచ్ ప్లాట్ కూడా ఇలాగే వేసుకోవచ్చు. ఈ స్టైల్ ప్యాంట్‌షర్ట్, మిడీస్.. మోడ్రన్ డ్రెస్సులకే కాదు గాగ్రా, లంగాఓణీ మీద కూడా అందంగా ఉంటుంది. సింగిల్ ఫ్రెంచ్ ప్లాట్: నాలుగు నుంచి ఎనిమిది పాయలు తీసుకుంటూ పై నుంచి జడ అల్లాలి. దీనికి చిన్న చిన్న హెయిర్ బీడ్స్ అలంకరిస్తే మరింత అందంగా ఉంటుంది. ఈ స్టైల్ సంప్రదాయ తరహా దుస్తుల మీదకు బాగుంటుంది. నెం.8 స్టైల్: జుట్టును చివరి వరకు మెలితిప్పి, పైకి రెండుసార్లు మడిచి, మధ్యలో క్లిప్ పెట్టాలి. నెం.8ను పోలినట్టుగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు. ఈ హెయిర్‌స్టైల్ చీరకట్టుకి ఇంటబయటా అందంగా ఉంటుంది. రిలీఫ్‌గా కూడా అనిపిస్తుంది. హెయిర్ స్టైలిస్ట్: శాంతి, సాక్షి టీవీ ఫొటోలు: శివ మల్లాల