నగరంలోని రమష్ ఆస్పత్రిలో శుక్రవారం డీఎంహెచ్‌వో (జిల్లా వైద్యఆరోగ్య శాఖ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వివిధ విభాగాల్లోని మెడికల్ పరికరాలను అధికారులు పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. పాయకరావుపేట రాజీవ్ నగర్కు చెందిన ఆసుల సీతామహాలక్ష్మి అనే మహిళకు జ్వరం రావడంతో ఆమె కుటుంబసభ్యులు గత ఏడాది ఆగస్ట్ 31న బందర్‌రోడ్‌లోని రమేష్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు స్వైన్ ఫ్లూ ఉందంటూ నివేదిక ఇచ్చారు. రెండు రోజుల అనంతరం కుటుంబసభ్యులు...మహిళను గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్చించారు. వైద్య పరీక్షల అనంతరం సీతా మహాలక్ష్మికి స్వైన్ ఫ్లూ లేదని ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చారు.