జూన్ నుంచి బిజీ బిజీగా! | manchu manoj birth day special story | Sakshi
Sakshi News home page

జూన్ నుంచి బిజీ బిజీగా!

Published Thu, May 19 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

జూన్ నుంచి బిజీ బిజీగా!

జూన్ నుంచి బిజీ బిజీగా!

లైవ్ వైర్‌కి చిరునామా అన్నట్లుగా ఉంటారు మంచు మనోజ్. సినిమాల్లోనే కాదు.. విడిగా కూడా చాలా జోష్‌గా ఉంటారు. ‘మేజర్ చంద్రకాంత్’లో బాల నటుడిగా ఆకట్టుకున్న మనోజ్ ‘దొంగ దొంగది’ చిత్రం ద్వారా హీరోగా తెరంగేట్రం చేశారు. అప్పటి నుంచి వెరైటీ పాత్రలు చేస్తూ ‘రాకింగ్ స్టార్’ అనిపించుకున్నారు. ఇప్పటి వరకూ దాదాపు పదిహేను చిత్రాల్లో నటించి, ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. నేడు మనోజ్ పుట్టినరోజు.

ఈ సందర్భంగా తాను చేయనున్న మూడు చిత్రాలకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. ప్రసన్న దర్శకత్వంలో ‘సీతా మహాలక్ష్మి’ అనే చిత్రంలో, క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మించనున్న చిత్రంలో, అజయ్ అండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్‌ఎన్ రెడ్డి, ఎన్. లక్ష్మీకాంత్ తెరకెక్కించే చిత్రంలో  నటించనున్నారు. ఈ చిత్రాలు జూన్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement