సాక్షి, విజయవాడ: నగరంలోని రమష్ ఆస్పత్రిలో శుక్రవారం డీఎంహెచ్‌వో (జిల్లా వైద్యఆరోగ్య శాఖ) ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. వివిధ విభాగాల్లోని మెడికల్ పరికరాలను అధికారులు పరిశీలించారు. వివరాల్లోకి వెళితే.. పాయకరావుపేట రాజీవ్ నగర్కు చెందిన ఆసుల సీతామహాలక్ష్మి అనే మహిళకు జ్వరం రావడంతో ఆమె కుటుంబసభ్యులు గత ఏడాది ఆగస్ట్ 31న బందర్‌రోడ్‌లోని రమేష్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు స్వైన్ ఫ్లూ ఉందంటూ నివేదిక ఇచ్చారు. రెండు రోజుల అనంతరం కుటుంబసభ్యులు...మహిళను గవర్నమెంట్ ఆస్పత్రిలో చేర్చించారు. వైద్య పరీక్షల అనంతరం సీతా మహాలక్ష్మికి స్వైన్ ఫ్లూ లేదని ప్రభుత్వ వైద్యులు నివేదిక ఇచ్చారు.
జరిగిన తప్పిదంపై మహిళ కుటుంబీకులు అప్పట్లో రమేష్ ఆస్పత్రి సీఈవోను కలిసి ఈ ఘటనపై వివరణ అడిగారు. స్పైన్ ఫ్లూ ఉందని చికిత్స కోసం రూ.52 వేలు వసూలు చేశారని ప్రశ్నించగా, తాము చేయాల్సిన పని చేశామని తమ తప్పు లేదని సీఈవో చెప్పడంతో జరిగిన తప్పిదంపై బాధిత మహిళ కుటుంబసభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. అయితే పోలీసులు కూడా స్పందించకపోవడంతో కమిషనర్‌ను కలిసి తమ ఆవేదన తెలిపారు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో తమకు సరైన వైద్యం చేయకుండా ఆసుపత్రి వర్గాలు నిర్లక్ష్యం గా వ్యవహరించారని సీతామహాలక్ష్మి కుమారుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారణకు ఆదేశించడంతో డీఎంహెచ్‌వో రంగంలోకి దిగి విచారణ చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment