
సాక్షి, కృష్ణా: విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్ బాబుపై రెండో రోజు విచారణ కొనసాగుతోంది. అగ్ని ప్రమాద ఘటనలో పది మంది మృతిపై పోలీసులు విచారణలో వేగం పెంచారు. డాక్టర్ రమేష్ విచారించేందుకు హైకోర్టు అనుతించడంతో మంగళవారం రెండో రోజు ఏడీసీపీ లక్ష్మీపతి విచారిస్తున్నారు. సూర్యారావుపేట పోలీసు స్టేషన్‌కు చేరుకొన్న రమేష్‌ను న్యాయవాది సమక్షంలో నేటి సాయంత్రం 5గంటల వరకు ఏడీసీపీ విచారించనున్నారు. ఈరోజు విచారణలో కీలక అంశాలపై వివరాలు రాబట్టేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అధిక ఫీజులు వసూలు చేశారన్న మృతుల బంధువుల ఆరోపణపై నిజాలు రాబట్టేందుకు ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. లోపభూయిష్టంగా, నిబంధనలు పాటించకుండా కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహించారన్న అభియోగంపై విచారణ సాగుతోంది. చదవండి: రమేష్ బాబు విచారణకు హైకోర్టు అనుమతి
Comments
Please login to add a commentAdd a comment