వీఆర్వో, వీఆర్‌ఏ ఫలితాలు విడుదల | vra vro results | Sakshi
Sakshi News home page

వీఆర్వో, వీఆర్‌ఏ ఫలితాలు విడుదల

Published Sun, Feb 23 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

వీఆర్వో, వీఆర్‌ఏ ఫలితాలు విడుదల

వీఆర్వో, వీఆర్‌ఏ ఫలితాలు విడుదల

  • జిల్లా టాపర్లు సీతామహాలక్ష్మి, గోపాలరావు
  •  1 : 3 నిష్పత్తిలో ఇంటర్వ్యూలు
  •  27న సర్టిఫికెట్ల పరిశీలన
  •  మెరిట్ లిస్ట్ నేడో, రేపో
  •  మచిలీపట్నం, న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షా ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి శనివారం విడుదలృచేశారు. ఈ నెల రెండున ఈ పరీక్షలు నిర్వహించారు. మొత్తం వంద మార్కులకు జరిగిన వీఆర్వో పరీక్షల్లో గంపలగూడెం మండలం నెమలి గ్రామానికి చెందిన సీహెచ్ సీతామహాలక్ష్మి 96 మార్కులతో, వీఆర్‌ఏ పరీక్షల్లో ఎ.కొండూరు మండలం చీమలపాడుకు చెందిన గుండ్రు గోపాలరావు 92 మార్కులతో జిల్లా టాపర్లుగా నిలిచారు. గోపాలరావు వీఆర్వో పరీక్షలోనూ 92 మార్కులతో 40వ స్థానంలో నిలిచాడు.

    వీఆర్వో పరీక్షలో పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన ఎం.గోపాలకృష్ణ (95 మార్కులు), ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన అల్లాడ నళినికుమార్ (95 మార్కులు), అవనిగడ్డకు చెందిన కమ్మిలి హరిబాబు (94 మార్కులు), గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామానికి చెందిన బొద్దుల నాగరాజు (94 మార్కులు) సాధించి మొదటి ఐదు స్థానాల్లో నిలిచారు.

    వీఆర్‌ఏ పరీక్ష ఫలితాల్లో మచిలీపట్నం మండలానికి చెందిన ముదినేని గాయత్రిదేవి (91 మార్కులు), ఎ.కొండూరు చీమలపాడుకు చెందిన నన్నెబోయిన గోపీకృష్ణ (91 మార్కులు), కోడూరు మండలం విశ్వనాథపల్లికి చెందిన సీహెచ్ వెంకటనారాయణ (91 మార్కులు), జగ్గయ్యపేట మండలం అన్నవరం దాచేపల్లి రమేష్ (91 మార్కులు), జగ్గయ్యపేట మండలం అన్నవరానికి చెందిన దాచేపల్లి శ్రీను (91 మార్కులు)తో తర్వాతి స్థానాలు సాధించారు.
     
    ర్యాంకుల ఆధారంగా ఇంటర్వ్యూలు...

    జిల్లాలో ఖాళీగా ఉన్న 64 వీఆర్వో, 403 వీఆర్‌ఏ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 2న పరీక్షలు నిర్వహించారు. వీఆర్వో పరీక్షకు 59,024 మంది దరఖాస్తు చేసుకోగా 52,119 మంది, వీఆర్‌ఏ పరీక్షకు 7,542 మంది దరఖాస్తు చేసుకోగా 6,684 మంది హాజరయ్యారు. అభ్యర్థులకు వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తామని రెవెన్యూ అధికారులు తెలిపాయి.  ఈ నెల 27 నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీకే మహంతి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    జిల్లాల వారీగా వీఆర్వో, వీఆర్‌ఏ మెరిట్ జాబితాలను శనివారం కలెక్టర్లకు పంపించిన ఆయన ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలపై పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్ వ్యవస్థను పటిష్టంగా ఉపయోగించుకుని పారదర్శకంగా పోస్టుల భర్తీ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న మచిలీపట్నం జిల్లా కలెక్టరేట్‌లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు.
     
    నేడో, రేపో మెరిట్ లిస్ట్...
     
    రాష్ట్రంలోని వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీలో భాగంగా ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి జిల్లాల వారీగా భర్తీ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జిల్లాలోని పోస్టులు, అభ్యర్థుల మార్కులు, ర్యాంకుల వారీగా మెరిట్ లిస్టును ఆది, సోమవారాల్లో ప్రకటించే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అనంతరం పోస్టుల భర్తీ ప్రక్రియ ఇలా ఉంటుంది. జిల్లాలో 64 వీఆర్వో పోస్టులు ఉండగా వాటిలో ఓపెన్ కేటగిరీలో 18 పోస్టులు, ఓసీ మహిళా కోటాలో 9, ఎస్సీలకు 5, ఎస్సీ మహిళ 3, ఎస్టీలకు 2, ఎస్టీ మహిళలకు 2, బీసీ-ఏ 4, బీసీ-ఏ మహిళలకు 1, బీసీ-బీ 4, బీసీ-బీ మహిళలకు 3, బీసీ-సీ 1, బీసీ-డీ 3, బీసీ-డీ మహిళలు 2, బీసీ-ఈ 2, బీసీ-ఈ మహిళకు 1, మాజీ సైనికుల కోటాలో 2, ఓసీ వీహెచ్ 1, ఓసీ ఓహెచ్ 1 చొప్పున పోస్టులను కేటాయించారు. వీఆర్‌ఏల భర్తీ ప్రక్రియ మండలాలవారీగా నిర్వహిస్తారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement