కల సాకారమయ్యే రోజు అందంగా కళ కళ లాడడానికి కేశాల నుంచి పాదాల దాకా తీర్చిదిద్దుకుంటున్నారు నవ వధువులు. ఈ నేపథ్యంలోనే వీరి కోసం డిజైనర్ దుస్తులు సహా మరెన్నో వస్తున్నట్టే... పెళ్లిళ్లలో రకరకాల సందర్భాలకు తగ్గట్టుగా కేశాలను, ముఖ వర్చస్సు, చేతి గోళ్లను తీర్చిదిద్దే విభిన్న రకాల మేకప్, హెయిర్ స్టైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఫిల్మీ నేమ్స్‌తో హెయిర్ స్టైలిస్ట్‌లు వీటిని అందిస్తున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: సినిమాలు ఎప్పుడూ కొత్త కొత్త స్టైల్స్ మోసుకొస్తాయి. మామూలుగానే అందంగా మెరిసిపోయే హీరోయిన్స్ పెళ్లిళ్లు వంటి సన్నివేశాల్లో మరింత అద్భుతంగా ఆకట్టుకుంటారు. ‘‘అటు సినిమా లుక్‌ని ప్రతిబింబిస్తూనే అవి రియల్‌లైఫ్‌కూ నప్పేలా స్టైల్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది’’ అని లాక్మెకు చెందిన క్రియేటివ్ డైరెక్టర్ పూజా సింగ్ అంటున్నారు.
మూవీ నేమ్.. బ్రైడ్‌కి ఫేమ్
విభిన్న రకాల సినిమాల స్ఫూర్తితో డిజైన్ చేసిన మేకప్, హెయిర్‌స్టైల్స్‌కి అవే సినిమా పేర్లతోనే అందిస్తుండడం విశేషం. తల వెంట్రుకలు, మేకప్, నెయిల్స్ సై్టల్స్ అన్నీ కలిపి ఎంగేజ్‌మెంట్ సెర్మనీ కోసం అందించే స్టైల్‌కి ఉఫ్ తెరీ అదా లుక్ అని పేరు పెట్టారు. అలాగే సంగీత్ వేడుకలో భాగంగా డ్యాన్స్‌ఫ్లోర్ మీద సన్నిహితులతో కలిసి సందడి చేసే వధువు కోసం ప్రత్యేకంగా ‘మహి వె’ పేరిట స్టైల్‌ని క్రియేట్ చేశారు. ఇక మెహిందీ సెర్మనీ రోజున పెళ్లి కూతురు చుట్టూ చేరిన వారు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. దీని కోసం తగ్గట్టుగా ‘మెహందీ లగా కే రఖ్‌నా’ పేరుతో స్టైల్ డిజైన్ చేశారు. పెళ్లి రోజున గంధర్వ కన్యలా మెరిసిపోయేలా కేశాలు, మేకప్‌తో బ్రైడ్ నెం.1, రిసెప్షన్ వేడుక కోసం వాఖ్రా స్వాగ్ లుక్, సంప్రదాయబద్ధంగా సిగ్గులొలికే వధువును ప్రతిబింబించేలా అమీ తుమాకే బలోబాషి , దక్షిణాది స్టైల్స్‌కు చిహ్నంగా కన్యాకుమారి లుక్, అందిస్తున్నారు. అదే విధంగా దీవానీ మస్తానీ, దిల్‌వాలె దుల్హనె లే జాయేంగే... ఇలా విభిన్న రకాల ఆకర్షణీయమైన పేర్లతో మరింత ఆకర్షణీయంగా ఈ స్టైల్స్‌ని సృష్టిస్తూ సిటీ అమ్మాయిల బ్రెడల్ లుక్‌ని తీర్చిదిద్దుతున్నారు.
బ్లాక్ బస్టర్ క్రియేట్ చేశాం...
సినిమాలలో కధానాయికల లుక్‌ని చాలా మంది అమ్మాయిలు ఇష్టపడతారు. తమ జీవితంలోని ప్రత్యేక సందర్భాల్లో హీరోయిన్స్‌లా తమ స్టైల్స్ బాగుండాలని ఆశిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేకప్ ఆర్టిస్ట్‌లు కొత్త కొత్త లుక్స్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఈ ట్రెండ్‌కు అనుగుణంగానే ది బ్లాక్ బస్టర్ బ్రైడ్స్ పేరుతో మేం కొత్త సై్టల్స్‌ని సృష్టించాం. – పుష్కరాజ్ షెనాయ్, లాక్మె సెలూన్స్
Comments
Please login to add a commentAdd a comment