యువత రకరకాల హెయిర్ స్టయిల్స్ ఫాలో అవుతుంటుంది. సినిమాల్లో హీరోయిన్లు కొత్త హెయర్ స్టయిల్ పరిచయం చేస్తే ఇక ముందు వెనుక ఆలోచించే పనే లేదన్నట్లు ఫాలో అయిపోతుంది కాలేజ్ యువత. అలా ఎన్నెన్నో కొంగొత్త హెయిర్ స్టయిల్స్ వచ్చాయి. వాటిలో బాగా క్లిక్ అయ్యింది, యువతను బాగా అట్రెక్ట్ చేసింది బాబ్ హెయిర్ స్టయిల్. ఈ హెయర్ స్టయిల్ భారతదేశంలోకి ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి అనుసరించేవారంటే..
ఈ హెయిర్ స్టయిల్ బాలీవుడ్ మూవీ 'కుచ్‌కుచ్ హోతా హై' కాజోల్‌దే తొలి హెయిర్ స్టయిల్ అని చెప్పొచ్చు గానీ అంతకుమునుపు మన తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ ఈ లుక్‌లోనే ఉండేవారు. మన భారతదేశంలో ఆమె నుంచి ఈ బాబ్ హెయిర్ స్టయిల్ మన దేశంలోకి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఎవ్వరూ ఆ కాలంలో దీన్ని అనుకరించే డేర్ చేయలేదు. ఎందుకంటే? పురుషాధిక్య ప్రపంచంలో మహిళలు ఇలా హెయిర్ స్టయిల్ వేసుకునుందుకు జంకే వారు. పైగా దాన్నో పెద్ద నేరంగా భావించేవారు.
దీంతో అప్పట్లో ఇలాంటి హెయిర్ స్టయిల్ అంతగా ప్రజాదరణ పొందలేదు. ఇక కాజోల్ మూవీ "కుచ్‌కుచ్ హోతా"లో షార్ట్ భాబ్ హెయిర్ స్టయిల్‌లో కనిపించినప్పటి నుంచి ఈ హెయిర్ స్టయిల్‌కి కాస్త్ర క్రేజ్ వచ్చిందని చెప్పొచ్చు. అప్పటి నుంచి చిన్న పిల్లలకు దీన్ని బేబీ హెయిర్ స్టయిల్‌గా ఉపయోగించేవారు. అయితే ఇది పిల్లలకు చాలా క్యూట్‌గా ఉండి మంచి లుక్ ఇచ్చేది. ఆ తర్వాత క్రమంగా టీనేజర్లు ఈ లుక్‌ని పాలో అయ్యేవారు. దీన్ని 'టామ్ బాయ్ స్టయిల్" అని కూడా పిలిచేవారు. అయితే ఈ హెయిర్ స్టయిల్ సమ్మర్‌లో మంచి కంఫర్ట్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఈ ఎండలకు ఉక్కపోతతో చిర్రెత్తుకొస్తుంటుంది. వొంటి మీద బట్టలే ఈ ఎండల ధాటికి కంపరంగా అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో పొడవాటి జుట్టుతో ఇబ్బంది అంతా ఇంతా కాదు!.
అయితే ఈ స్టయిల్ కొన్నాళ్లుకు కనుమరుగయ్యి చిన్న జడలు ట్రెండ్‌లోకి వచ్చాయి. జస్ట్ భజాల దాక జుట్టు వదిలేసుకోవడం కూడా బాగా ట్రెండ్ అయ్యింది. ఆ తర్వాత మహిళా ఆఫీసర్లు, అధికారులు ఈ స్టయిల్‌నే అనుసరించేవారు. మళ్లీ ఇన్నేళ్లుకు షార్ట్ బాబ్(టామ్ బాయ్) హెయిర్ స్టయిల్ ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ సినీ తారలు అలియా భట్, అనుష్కా కోహ్లి నుంచి దీపికా పదుకునే వరకు అంతా ఈ హెయర్ స్టయిల్‌నే ఫాలో అవుతుండటం విశేషం.
ఇక ఇటీవలే జరిగిన ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌లో కూడా ఈ హెయిర్ స్టయిల్‌తోనే రెడ్‌కార్పెట్‌పై హాలీవుడ్ హిరోయిన్‌లు సందడి చేశారు. పాత హెయిర్ స్టయిల్ అయినా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ స్టయిల్‌గా ఈ షార్ట్ బాబ్ హెయర్ స్టయిల్ నిలచిపోయింది. భారతదేశం లాంటి దేశంలో సమ్మర్‌లో మంచి వెసులుబాటుగా ఉండే హెయిర్ స్టయిల్ ఇది. ఈ సమ్మర్‌లో పిల్లలతో చక్కగా ఎంజాయ్ చేయాలంటే సరదాగా మీరు ఈ హెయిర్ స్టయిల్‌లని ఫాలో అయిపోండి ఇంకెందుకు ఆలస్యం.
Comments
Please login to add a commentAdd a comment