US Woman Breaks Guinness World Record For Largest Afro - Sakshi
Sakshi News home page

24 ఏళ్లుగా పెంచుతూ.. ఈమె జుట్టు మీదే రికార్డులు ఉన్నాయి

Published Fri, Apr 7 2023 8:49 AM | Last Updated on Fri, Apr 7 2023 10:47 AM

US Woman Breaks Guinness World Record For Largest Afro - Sakshi

సరదా.. కొందరికి అనుకోకుండా గుర్తింపు తెచ్చిపెడుతుంటుంది. అదే పనిగా ఆ పనిలో మునిగిపోతే.  లూసియానాకు చెందిన 47 ఏళ్ల ఏవిన్ డుగాస్ జుట్టుతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు పది ఇంచుల పొడవు ఆఫ్రో(ఆఫ్రికన్‌ స్టైల్‌) హెయిర్‌స్టైల్‌తో ఈమె ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 

అయితే.. ఆమె గిన్నిస్‌ రికార్డు బద్ధలు కొట్టడం ఇదే తొలిసారి కాదు. 2010 సమయంలో.. నాటుగు ఫీట్ల జుట్టుతోనూ ఆమె ఇలాగే రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఆ జుట్టును మరింతగా పెంచి.. తన రికార్డును తానే బద్ధలు కొట్టుకున్నారామె.  గత 24 ఏళ్లుగా ఆమె ఆ జుట్టును అలాగే పెంచుతోందట. అయితే.. 

మొదట్లో ఆమె జుట్టు కోసం కెమికల్స్‌ వాడేదట. వాటిలో చాలావరకు ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని తర్వాతే ఆమెకు తెలిసిందట. దీంతో అప్పటి నుంచి ఆమె సహజ పద్ధతుల్లోనే జుట్టును పెంచుతూ వస్తోందామె. తన జుట్టుకోసం ఓ హెయిర్‌ స్టైల్‌ డిజైనర్‌ను పెట్టుకున్న ఆమె, కేవలం అంచులు కత్తిరించేందుకు మాత్రమే ఆమెను పిలిపించుకుంటుందట. ఆ జుట్టు మెయింటెనెన్స్‌ కష్టంగా ఉన్నప్పటికీ.. ఇష్టంతోనే తాను ముందుకు వెళ్తున్నట్లు చెప్తోంది డుగాస్‌. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement