lousianana
-
Largest Hair: ఈమె జుట్టు మీదే రికార్డులు ఉన్నాయి
సరదా.. కొందరికి అనుకోకుండా గుర్తింపు తెచ్చిపెడుతుంటుంది. అదే పనిగా ఆ పనిలో మునిగిపోతే. లూసియానాకు చెందిన 47 ఏళ్ల ఏవిన్ డుగాస్ జుట్టుతో గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు పది ఇంచుల పొడవు ఆఫ్రో(ఆఫ్రికన్ స్టైల్) హెయిర్‌స్టైల్‌తో ఈమె ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అయితే.. ఆమె గిన్నిస్ రికార్డు బద్ధలు కొట్టడం ఇదే తొలిసారి కాదు. 2010 సమయంలో.. నాటుగు ఫీట్ల జుట్టుతోనూ ఆమె ఇలాగే రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఆ జుట్టును మరింతగా పెంచి.. తన రికార్డును తానే బద్ధలు కొట్టుకున్నారామె. గత 24 ఏళ్లుగా ఆమె ఆ జుట్టును అలాగే పెంచుతోందట. అయితే.. మొదట్లో ఆమె జుట్టు కోసం కెమికల్స్ వాడేదట. వాటిలో చాలావరకు ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని తర్వాతే ఆమెకు తెలిసిందట. దీంతో అప్పటి నుంచి ఆమె సహజ పద్ధతుల్లోనే జుట్టును పెంచుతూ వస్తోందామె. తన జుట్టుకోసం ఓ హెయిర్ స్టైల్ డిజైనర్‌ను పెట్టుకున్న ఆమె, కేవలం అంచులు కత్తిరించేందుకు మాత్రమే ఆమెను పిలిపించుకుంటుందట. ఆ జుట్టు మెయింటెనెన్స్ కష్టంగా ఉన్నప్పటికీ.. ఇష్టంతోనే తాను ముందుకు వెళ్తున్నట్లు చెప్తోంది డుగాస్. -
ఎవరూ చూడట్లేదనుకుని బీర్ కేసులను..
లూసియానా: దొంగలు మద్యం బాటిళ్లను ఎత్తుకెళ్లడం చూశాం.. కానీ ఓ జంట ఏకంగా బీర్ కేసులనే దొంగిలించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఈ దంపతులను అరెస్ట్ చేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని లూసియానాలో మాత్యూ ఫోర్బ్స్, అష్లే ఫోర్బ్స్ దంపతులు మద్యానికి బానిసయ్యారు. ఈ క్రమంలో షాపుల్లో చొరబడి మద్యాన్ని ఎత్తుకెళ్లేవారు. వీరి నిర్వాకం గురించి తెలిసిన కొన్ని సంస్థలు తమ దుకాణాల్లో వారి ప్రవేశాన్ని నిషేధించాయి. అయినప్పటికీ వారు తీరు మార్చుకోలేదు. ఎంతో చాకచక్యంగా షాపుల్లో దూరి కావాల్సిన బీర్ క్యాన్లను ఎంపిక చేసుకుంటారు. అనంతరం ఎవరూ వాళ్లను గమనించట్లేదని నిర్ధారించుకోగానే వాటిని తస్కరిస్తారు. ఎలాంటి బిల్లు కట్టకుండా వాటితో పరారయ్యేవారు. తాజాగా మాత్యూ ఫోర్బ్స్ ఇదే సూత్రాన్ని ఫాలో అయి బీర్ బాటిళ్లు ఎత్తుకుపోయే ప్రయత్నం చేయగా అది అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. మరో షాపులో వస్తువులతో సహా ఉడాయించేందుకు సమాయత్తమవుతున్న అతని భార్య అష్లేను సైతం పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఇరువురిని జైలుకు తరలించి విచారణ చేపట్టారు. కాగా ఇప్పటివరకు ఈ జంట వెయ్యి డాలర్లకు పైగా (సుమారు రూ.73 వేల) విలువైన మద్యాన్ని చోరీ చేయడం గమనార్హం. అష్లేపై గతంలో మాదక ద్రవ్యాల కేసు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
కొత్తింటి కోసం వెతుకులాట