ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు విరాట్ సొంతం. కాగా, ఇలా విరాట్‌ని అత్యంత ఎక్కువగా ఇష్టపడే అభిమాని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో విన్నూత్నమైన హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. అయితే అతని హెయిర్‌స్టైల్ అక్కడి వారందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. చిరాగ్ ఖిలరే అనే వ్యక్తి విరాట్ ముఖంని పోలినట్లు ఉండే విధంగా తన హెయిర్ స్టైలింగ్ చేయించుకున్నాడు.
అంతేకాక.. దాన్ని ఫొటో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘ది బెస్ట్ విరాట్.. మనస్సు నుంచి తలవరకూ’ అంటూ అతను ఈ ఫొటోకి క్యాప్షన్ పెట్టాడు.‘అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పటి నుంచి నేను విరాట్‌కు అభిమానిగా ఉంటున్నాను. అప్పటి నుంచి అతను ఆడే ప్రతీ మ్యాచ్‌కి నేను వెళ్తాను. కోహ్లిని కలవడం నా కల. నేను అతన్ని కలిసినప్పుడు ముందు అతని కాళ్లను ముట్టుకొని.. ఆ తర్వాత అతన్ని కౌగిలించుకుంటాను. ఆ జ్ఞాపకాన్ని ఓ ఫొటోగ్రాఫ్‌లో బంధిస్తాను’ అని చిరాగ్ తెలిపాడు.
The best @imVkohli
— Chirag Khilare (@Chirag_Viratian) December 12, 2019
From heart to head 🇮🇳🥰#viratianchirag @OaktreeSport @buntysajdeh @Cornerstone_CSE @jogeshlulla @BCCI @BCCIdomestic @RCBTweets @rcbfanarmy @ICC @cricketworldcup @imVkohli @vkfofficial @virendersehwag @gauravkapur @jatinsapru @IrfanPathan @RaviShastriOfc pic.twitter.com/ojQqNGWzGL
Comments
Please login to add a commentAdd a comment