
ఇది ‘లవ్లీ్ల బ్రెయిడ్’ హెయిర్ స్టయిల్. ఇది చూడటానికి అందంగా, కొత్తగా ఉంటూ... చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. దీన్ని వేసుకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. అలాగే దీనికి జుత్తు మరీ ఒత్తుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ హెయిర్ స్టయిల్ స్కర్ట్స్, జీన్స్, శారీస్ మీదకు భలేగా నప్పుతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్నిరకాల పార్టీలకు అందరూ వేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే కింద ఇచ్చిన స్టెప్స్‌ను ఫాలో అవుతూ ప్రయత్నించండి.
►ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. హెయిర్‌స్ప్రే చేసుకొని దువ్వుకుంటే జుత్తు మృదువుగా మారుతుంది. తర్వాత జుత్తు మొత్తానికీ కలిపి ఓ బ్యాండ్ పెట్టుకోవాలి.
►ఇప్పుడు పోనీలో నుంచి కొంత జుత్తును చేతుల్లోకి తీసుకోవాలి.
►తర్వాత ఆ జుత్తును కాస్తంత వదులుగా పట్టుకొని, బ్యాండ్ చుట్టూ చుట్టుకోవాలి.
►అలా చుట్టుకున్న జుత్తు చివర్లు బయటికి రాకుండా స్లైడ్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఫొటోలో కనిపిస్తున్నట్టుగా మీ జడ ఉంటుంది.
►కింద మిగిలిన జుత్తును మరోసారి దువ్వుకొని పూర్తిగా పైకి తీసుకెళ్లాలి. అలాగే బ్యాండ్‌ను కాస్తంత గ్యాప్ వచ్చేలా లాగి పట్టుకోవాలి.
►ఇప్పుడు ఆ జుత్తును పైనున్న బ్యాండ్‌లో నుంచి బయటికి తీయాలి.
►అలా బయటికి తీసిన జుత్తును రెండు భాగాలుగా చేసుకోవాలి.
►ఆ రెండు భాగాల జుత్తుతో రెండు ముళ్లు వేయాలి. ఆపైన చివర్లు కనిపించకుండా స్లైడ్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో అందమైన హెయిర్ స్టయిల్ మీ సొంతమవుతుంది.
సిల్కీ అండ్ షైనీ
రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యానికి హెయిర్ మొత్తం పాడైపోతుందని బాధపడుతున్నారా? ఆయిల్స్, షాంపూస్, కండీషనర్స్ మార్చి మార్చి విసిగిపోయారా? అయితే ఇలా ప్రయత్నించండి.
కావల్సినవి: కొబ్బరి పాలు – 4 టీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ – 2 టీ స్పూన్స్, నిమ్మరసం – 1 టీ స్పూన్
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొబ్బరి పాలు, ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హెయిర్ చిక్కులు లేకుండా దువ్వుకుని, కుదుళ్లకు పట్టేలా మొత్తం హెయిర్‌కు ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకుని, ఓ 30 నిమిషాల తరువాత తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment