
ఎన్ని హెయిర్ మోడల్స్ ఉన్నా జుట్టు విరబోసుకోవడమే ఎప్పటికీ నడిచే ట్రెండ్. చీరకట్టుకున్నా, జీన్స్ వేసుకున్నా క్రేజీగా కనిపించాలంటే హెయిర్ లీవ్ చేసుకోవాలి. తీరా జుట్టు విరబోసుకున్న తర్వాత.. కాసేపటికి చెరలేగిపోయి.. చిక్కులు పడి.. చిరాకు తెప్పిస్తాయి వెంట్రుకలు. అందుకే హెయిర్ బ్యాండ్స్ పెట్టుకుంటారు చాలా మంది. అలా హెయిర్ బ్యాండ్స్ అవసరం లేకుండా హెయిర్‌నే బ్యాండ్‌లా మార్చుకేనే మోడల్ ఇది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.
- ముందుగా జుట్టునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. హెయిర్ స్ప్రే చేసుకొని దువ్వుకుంటే జుట్టు మరింత మృదువుగా మారుతుంది. ఇప్పుడు జుట్టునంతా స్ట్రెయిటెనింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడమవైపు చెవి పక్క నుంచి మూడు చిన్న చిన్న పాయలు తీసకుని.. చిత్రంలో చూపిస్తున్న విధంగా అల్లుకోవాలి.
- కుడివైపు కూడా అదే విధంగా చివరి వరకూ చిన్న జడ అల్లుకోవాలి. ఇప్పుడు కుడి ఎడమ జడలను పక్కకు పెట్టుకుని మిగిలిన జుట్టునంతా ఒకసారి దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకోవాలి.
- తర్వాత పాయలను కాస్త లూజ్ చేసుకోవాలి. ఆ సమయంలో పాయల్లోంచి వెంట్రుకలు బయటికి రాకుండా, తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ఇప్పుడు కుడి జడను ఎడమ వైపుకు.. ఎడమ జడను కుడివైపుకు.. తిప్పుకుని చిత్రంలో ఉన్న విధంగా పెట్టుకుని ఊడిపోకుండా హెయిర్ పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు కుడి లేదా ఎడమవైపు తల ముందు భాగంలో చిన్న ఫంక్ తీసుకుంటే అదిరే లుక్ మీ సొంతమవుతుంది.
హెయిర్‌కేర్
కేశసంరక్షణకు కాస్త సమయం
జుట్టు ఒత్తుగా పెరగాలన్నా.. వెంట్రుకలు తెగిపోకుండా, రాలిపోకుండా ఉండాలన్నా.. కనీసం వారానికి రెండు సార్లు స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో మర్దనా చేసుకుని మరునాడు తలస్నానం చెయ్యడం తప్పనిసరి. ఇక పెరుగుతున్న కాలుష్యానికి చర్మంతో పాటు వెంట్రుకలు కూడా నిగారింపుని కోల్పోతున్నాయి. జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. అలాంటి సమస్యలు దూరం కావాలంటే ఇలా ప్రయత్నించండి.
కావల్సినవి:
కొత్తిమీర రసం – 2 టేబుల్ స్పూన్లు
కలబంద గుజ్జు – 4 టేబుల్ స్పూన్లు
ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు
పుల్లటి పెరుగు – 3 టేబుల్ స్పూన్లు
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కలబంద గుజ్జు, పుల్లటి పెరుగు, ఆలివ్ నూనె, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుని.. తలకు బాగా పట్టించి.. 30 లేదా 35 నిమిషాల తర్వాత తల స్నానం చెయ్యాలి. ఇలా వారానికి ఒకటీ లేదా రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment