
ఎండల్లో హాయ్ హాయ్...!
వాలు జడను ఒయ్యారంగా తిప్పుతూ... అంతే ఒయ్యారంగా నడిచే అమ్మాయిలను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అఫ్‌కోర్స్ ఇప్పుడు వాలు జడ భామలు దాదాపు కనిపించట్లేదనుకోండి. ఫ్యాషన్ పేరుతో జుట్టు కత్తిరించుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రుతీహాసన్, సమంత కూడా ఆ పనే చేశారు. హీరోయిన్లు కాబట్టి, ట్రెండ్‌ను అనుసరించి రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకోక తప్పదు. సినిమాల్లో ఎలా కనిపించినా విడిగా మాత్రం దాదాపు జట్టును వదులుగా వదిలేస్తారు. సమ్మర్‌లో అలా వదిలేస్తే, చీకాకుగా ఉంటుంది.
అందుకే, సమ్మర్ కోసం జుట్టును పొట్టిగా కత్తించుకున్నారు. ఇక, ఈ మండుతున్న ఎండల్లో హాయ్ హాయ్‌గా ఉంటామంటున్నారీ బ్యూటీలు. ‘సమ్మర్ లుక్ చూశారా’ అంటూ శ్రుతీహాసన్ తన కొత్త హెయిర్ స్టైల్‌ను చూపించారు. సమంత అయితే, ‘కురచ జుట్టుతో నేను కిడ్‌లా కనిపిస్తున్నా’ అంటూ తన లుక్ చూపించారు. ఏమైనా, అందగత్తెలు కురచ జుట్టులోనూ బాగానే ఉంటారు, వాలు జడలో కనిపించినా వారెవ్వా అనే విధం గానూ ఉంటారు కదూ!