Aalim Hakim Styles Rajinikanth For Jailer Movie, Pic With Superstar Goes Viral - Sakshi
Sakshi News home page

Jailer Movie: కొత్త రకం హెయిర్‌ స్టయిల్‌లో రజనీకాంత్‌!

Published Wed, Jul 27 2022 8:30 AM | Last Updated on Wed, Jul 27 2022 9:32 AM

Aalim Hakim Styles Rajinikanth For Jailer Movie, Shares Photo With Superstar - Sakshi

స్టయిలు స్టయిలులే ఇది సూపర్‌  స్టయిలులే.. అని రజనీకాంత్‌ స్టయిల్‌ మీద ‘బాషా’లో ఒక పాట ఉన్న విషయం తెలిసిందే. సిగరెట్‌ని గాల్లో విసిరి నోటితో క్యాచ్‌ పట్టడం,   వేగంగా నడవడం.. టోటల్‌గా రజనీ స్టయిల్‌ సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ సూపర్‌ స్టార్‌ని సూపర్‌ హెయిర్‌ స్టయిల్‌లో చూపించనున్నారు ముంబైకి చెందిన హెయిర్‌ స్టయిలిస్ట్‌ అలీమ్‌ హకీమ్‌. రజనీ హీరోగా ‘జైలర్‌’ టైటిల్‌తో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో రజనీని కొత్త రకం హెయిర్‌ స్టయిల్‌లో చూపించనున్నారు అలీమ్‌.

‘‘కింగ్‌ (రజనీని ఉద్దేశించి) తో వర్క్‌ చేసిన ఈ రోజు చాలా కొత్తగా ఉంది’’ అంటూ   రజనీతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు అలీమ్‌. ఇటీవల టెస్ట్‌ షూట్‌ జరిగిందని సమాచారం. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్‌ వచ్చే నెల ఆరంభం కానుంది. ఇందులో రజనీ సరసన ఐశ్వర్యా రాయ్‌ నటిస్తారని టాక్‌. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement