
క్రియేటివిటీకి కాదేదీ అనర్హం అన్నట్లు ఈమధ్య జనాలు వెరైటీ స్టంట్లతో పబ్లిసిటీ దక్కించుకుంటున్నారు. సోషల్‌మీడియాలో పాపులారిటీ, లైకుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి వెరైటీ హెయిర్‌స్టైల్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
ఏదైనా పండగ వస్తుందంటే చాలు అమ్మాయిల హడావిడి మామూలుగా ఉండదు. వేసుకునే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అందరి కంటే డిఫరెంట్‌గా రెడీ అవ్వాలని తెగ ట్రై చేస్తుంటారు. తాజాగా ఓ యువతి దీపావళి సందర్భంగా వెరైటీ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. రాకెట్లు, భూచక్రాలు సహా రకరకాల క్రాకర్స్‌తో జుట్టును అందంగా అలంకరించుకుంది.
దీనికి సంబంధించిన వీడియోను హెయిర్ స్టైలిస్ట్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది పర్‌ఫెక్ట్ దివాళీ బ్లాస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో యూజర్ స్పందిస్తూ.. ఒక్క అగ్గిపుల్లని ఆమె జుట్టుపైకి విసిరితే ఎంత ప్రమాదమో ఊహించండి, క్రియేటివిటి ఉండొచ్చు కానీ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అంటూ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment