cracker blast
-
టపాసులపై దేవతల బొమ్మలు ఉంటే కాల్చొద్దు
-
పబ్లిసిటీ కోసం ఇలాంటివి చేస్తారా? యువతి హెయిర్‌స్టైల్‌పై ఫైర్
క్రియేటివిటీకి కాదేదీ అనర్హం అన్నట్లు ఈమధ్య జనాలు వెరైటీ స్టంట్లతో పబ్లిసిటీ దక్కించుకుంటున్నారు. సోషల్‌మీడియాలో పాపులారిటీ, లైకుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ యువతి వెరైటీ హెయిర్‌స్టైల్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే.. ఏదైనా పండగ వస్తుందంటే చాలు అమ్మాయిల హడావిడి మామూలుగా ఉండదు. వేసుకునే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. అందరి కంటే డిఫరెంట్‌గా రెడీ అవ్వాలని తెగ ట్రై చేస్తుంటారు. తాజాగా ఓ యువతి దీపావళి సందర్భంగా వెరైటీ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. రాకెట్లు, భూచక్రాలు సహా రకరకాల క్రాకర్స్‌తో జుట్టును అందంగా అలంకరించుకుంది. దీనికి సంబంధించిన వీడియోను హెయిర్ స్టైలిస్ట్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది పర్ఫెక్ట్ దివాళీ బ్లాస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరో యూజర్ స్పందిస్తూ.. ఒక్క అగ్గిపుల్లని ఆమె జుట్టుపైకి విసిరితే ఎంత ప్రమాదమో ఊహించండి, క్రియేటివిటి ఉండొచ్చు కానీ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అంటూ హితవు పలికారు. View this post on Instagram A post shared by kamal_hairstylist_official (@kamal_hairstylist_official) -
విషాదం: బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు.. 8 మంది మృతి..
చెన్నై: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కృష్ణగిరి వద్ద బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చిధ్రమై పడి ఉన్నాయి. అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టారు. ఘటనాస్థంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న కొన్ని హోటళ్లు కూడా కూలిపోయాయి. పలు భవంతులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా.. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో స్పష్టంగా తెలియదు. వారిని బయటికి తీయడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 12 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరారు. మృతులు కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.50 వేలు ఇస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. Deeply saddened by the tragic mishap at a cracker factory in Krishnagiri, Tamil Nadu, resulting in the loss of precious lives. My thoughts and prayers are with the families of the victims during this extremely difficult time. May the injured recover soon. An ex-gratia of Rs. 2… — PMO India (@PMOIndia) July 29, 2023 పజాయపెట్టైలో జరిగిన ప్రమాదం భాదకలిగించిందని సీఎం స్టాలిన్ అన్నారు. బోగనపల్లిలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ బాణాసంచాను తయారు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం.. రూ.3లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్షఇవ్వనున్నట్లు చెప్పారు. స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారాన్ని కేటాయించారు. Deeply saddened by the loss of valuable lives in the mishap at the firecracker godown in Boganapalli, Krishnagiri District. My prayers and thoughts are with the bereaved families. Wishing a speedy recovery to those injured.- Governor Ravi — RAJ BHAVAN, TAMIL NADU (@rajbhavan_tn) July 29, 2023 ఇదీ చదవండి: కెనడాలో కొడుకు మరణం.. తట్టుకోలేక భారత్‌లో ఆగిన తల్లి గుండె.. -
ఇప్పుడే కదా కోలుకుంది.. మళ్లీ ఇదేంటి..!
-
ఇప్పుడే కదా కోలుకుంది.. మళ్లీ ఇదేంటి..!
చెన్నై: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో సామాజిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం వంటి జాగ్రత్తలు పాటిస్తే.. మనతో పాటు మన చుట్టూ ఉన్నవారి ఆరోగ్యాన్ని కాపాడినవారం అవుతామంటూ ప్రభుత్వాలు ఎంత ప్రచారం చేసినా కొందరు మాత్రం వీటిని అస్సలు పట్టించుకోవడం లేదు. అత్యుత్సాహం ప్రదర్శించి.. వారితో పాటు ఇతరులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సామాన్య జనం అనుకుంటే నాయకులు కూడా ఇలానే ఉన్నారు. ఇందుకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా మధురైలో చోటు చేసుకుంది. కరోనా నుంచి కోలుకుని వస్తోన్న తమ నాయకుడి కోసం కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. సామాజిక దూరాన్ని పాటించకుండా గుంపులుగా చేరి.. బాణాసంచా పేల్చుతూ.. హడావుడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. (తల్లికి కరోనా.. బుద్ధిమాద్యం కొడుకు కోసం) అసలే తమిళనాడులో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇలాంటి సమయంలో ఈ తలతిక్క పనులు ఏంటని నెటిజనులు కార్యకర్తలతో పాటు సదరు నాయకుడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. తమిళనాడు మినిస్టర్ సెల్లూరు రాజుకు కొంతకాలం క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన చెన్నైలోని ఎంఐఓటీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా ఏఐఏడీఎంకే కార్యకర్తలు తమ నాయకుడికి స్వాగతం చెప్పడానికి భారీ సంఖ్యలో గుమి కూడారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి.. హడావుడి చేశారు. సామాజిక దూరం పాటించలేదు. కొందరు సెల్ఫీ దిగేందుకు కూడా ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఏఎన్ఐ ట్విట్ చేసింది. దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకులే ఇలా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. (లాక్డౌన్ : తమిళనాడు కీలక నిర్ణయం) కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తమిళనాడులో ఆగస్టు 31 వరకు లాక్డౌన్ విధించింది. భారీ ఊరేగింపులు వంటి కార్యక్రమాలను నిషేధించింది. కానీ ఏఐఏడీఎంకే కార్యకర్తలు ఈ ఆదేశాలను పట్టించుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శిచారు. ప్రస్తుతం తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య2, 39, 978 కాగా యాక్టీవ్ కేసుల సంఖ్య 1,78, 178. మరణాల సంఖ్య 3, 838కి చేరింది. -
అమాయకుల ప్రాణాలు బలి
తూర్పుగోదావరి, తుని : రాష్ట్రంలో ఏదో ఒకచోట బాణసంచా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది బతుకు దెరువు కోసం పనికి వెళ్లి ప్రాణాలను కోల్పోతున్నారు. అధికారులు అనుమతులను రద్దు చేసినా తయారీ మాత్రం ఆగడం లేదు. ఇటీవల రాజమహేంద్రవరం లాలాచెరువు వద్ద జరిగిన ప్రమాదంతో అధికారులు కళ్లు తెరిచారు. గతేడాది ఏప్రిల్ నాలుగున తుని ఇసుకలపేట వద్ద మందుగుండు తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. నిబంధనలు పాటించని సంబంధిత తయారీ కేంద్రం అనుమతులను రద్దు చేయడంతో పాటు యజమానిపై కేసు నమోదు చేశారు. దీంతో బాణసంచా తయారీని తాత్కాలికంగా నిలిపివేశారు. తయారీదారుడు అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో అధికారులు ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రావడంతో మళ్లీ బాణసంచా సామగ్రి తయారీ ప్రారంభించారు. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లినా అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు పట్టించుకోలేదు. ఆ వ్యాపారి మూడు తారాజువ్వలు, ఆరు చిచ్చుబిడ్లు అన్న చందాన వ్యాపారం చేస్తున్నాడు. ఇందుకు ప్రతిఫలంగా అధికార పార్టీ చేసే కార్యక్రమాలకు తక్కువ ధరకు టపాసులను సరఫరా చేస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక అధికారులు మౌనం వహించారు. ఇటీవల పట్టణ పోలీసుస్టేషన్‌కు చెందిన అధికారి ఒకరు తనిఖీ పేరిట వెళ్లి బెదిరించినా.. ఆ వ్యాపారి నుంచి నగదు తీసుకుని వదిలేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సోమవారం పట్టణ సీఐ వి.శ్రీనివాస్ సిబ్బందితో కలిసి పాత బజారు వీధిలో ఉన్న వ్యాపారి గోడౌన్‌పై దాడి చేశారు. సుమారు రూ.రెండు లక్షలు విలువ చేసే సామగ్రి సీజ్ చేసి, అనుమతి లేకుండా వ్యాపారం చేస్తున్న నిందితుడు చెల్లుబోయిన శ్రీను అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా తయారీ గతేడాది ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో శ్రీను బాణసంచా తయారీ చేస్తున్నారు. గణపతి నవరాత్రుల ముగింపు వేడుకలకు ఎక్కువ ఆర్డర్లు రావడంతో తారాజువ్వలు, అవుట్లు భారీగా తయారీ చేసి గోడౌన్లో నిల్వ చేశారు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినా పట్టించుకోలేదు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రమాదంతో జిల్లా ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు సకాలంలో స్పందిస్తే ప్రాణ నష్టం జరగదని ప్రజలు అంటున్నారు. -
గోకులపాడు ఘటనలో మరో వ్యక్తి మృతి
విశాఖపట్నం : గోకులపాడు బాణసంచా పేలుడు ఘటన కేసులో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. బాణాసంచా పేలుడుతో గాయపడ్డ పసిరెడ్డి కృష్ణ సెవన్ హిల్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతిచెందాడు. మృతుడు కోట ఉరట్ల మండలం పందూరు వాసిగా గుర్తించారు. కాగా విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం గోకులపాడులోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో ఆదివారం సాయంత్రం పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. -
బాణాసంచా పేలి ఇద్దరు మృతి
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో భారత అభిమానుల సంబరాలు విషాదం నింపాయి. బాణాసంచా పేలడంతో ఇద్దరు మృతిచెందడంతో పాటు మరో ఐదుగురు గాయపడ్డ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... దాయాది పాకిస్థాన్ తో తలపడిన మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించడంతో అభిమానులు టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే వంగర మండలం కొత్తమయవాడలో బాణాసంచా పేల్చిన ఘటనలో ప్రమాదవశాత్తూ ఇద్దరు మృతిచెందడంతో పాటు మరో ఐదుగురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించారు. బాధితుల వివరాలు ఇంకా తెలియరాలేదు.