హే! ఇది నా హెయిర్‌ స్టైయిల్‌... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!! | A Viral Video bob cut elephant is getting its hair combed | Sakshi
Sakshi News home page

హే! ఇది నా హెయిర్‌ స్టైయిల్‌... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!!

Published Sat, Nov 20 2021 1:44 PM | Last Updated on Sat, Nov 20 2021 2:11 PM

A Viral Video bob cut elephant is getting its hair combed  - Sakshi

కోయంబత్తూర్‌: మాములుగా మనం ఎవరైన బయటకి వెళ్లేటప్పుడూ లేదా ఏదైన ఫంక్షన్‌కి వెళ్లాలనుకుంటే ఎంతలా రెడీ అవుతాం. అంతేందకు చాలామంది ట్రెండ్‌కి అనుగుణంగా రెడీ అవ్వడానకి ప్రయత్నిస్తారు కూడా. అయితే ఈ మధ్య ఆ ఫ్యాషన్‌ జాబితాలోకి జంతువులు కూడా చేరిపోతున్నాయి. అవి కూడా సరికొత్త ట్రెండ్‌ని సృష్టించడానికీ ప్రయత్నిస్తున్నాయి. పైగా మా కేం తక్కువ అన్నట్లుగా రెడీ అవ్వడానికీ తెగ ఇష్టపడుతున్నాయి. 

(చదవండి: ఆమె పాటకు ఫిదా.. స్టేజీ మీదే నోట్లతో అభిషేకం..!!

అసలు విషయంలోకెళ్లితే...కోయంబత్తూరులోని తేక్కంపట్టి గ్రామాంలోని ఒక ఏనుగు  ఎంత చక్కగా రెడీ అవుతుందో తెలుసా. నిజం ఆ ఏనుగు బాబ్‌ కట్‌ హెయిర్‌తో భలే ఆకర్షిస్తుంది. పైగా ఆ జుట్టును దువ్వించుకోవడానికి ఎలా కాళ్లను వంచి కిందికు ఉండి సహకరిస్తుందో చూడండి. అంతేకాదు చాల చక్కగా దువ్వించుకుని నుదటిపై తిలకంతో ఎంతో ఆకర్షణీయంగా రెడి అవుతుందో. ఏది ఏమైనా ఆ ఏనుగు బాబ్‌ కట్‌ హెయిర్‌తో మంచి స్టైయిలిష్‌గా ఠీవిగా ఉంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది. దీంతో నెటిజనల్లు వావ్‌ చాలా క్యూట్‌గా ఉందంటూ రకరకాలుగా ట్వీట్‌ చేశారు.

(చదవండి: భక్తి పారవశ్యంతో ఈ పూజారి చేసిన పని... విగ్రహానికి వైద్యం..!!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement