‘‘పూల రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు.. రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో’’అంటూ పూవులాంటి అమ్మాయిని పొగిడాడో సినీ కవి. కానీ ఆ పూల రెక్కలంత పలుచగా.. నిజమైన పువ్వేనేమో అన్నంత అం దంగా జుట్టును డిజైన్ చేయగలడీ హెయిర్‌డ్రెస్సర్. ఈ పూల కొప్పుల సృష్టికర్త వియత్నాంకు చెందిన 28 ఏళ్ల గుయెన్ ఫట్ ఫట్ ట్రి. ‘‘కొప్పున పువ్వులు పెట్టుకోవడం పాత పద్ధతి. కొప్పునే పువ్వులా దిద్దుకోవడం కొత్త స్టైల్’’అంటూ మందారం, చామంతి, లిల్లీ, లోటస్... ఇలా అనేక రకాల పూల డిజైన్లలో జుట్టును వేస్తున్నాడు. జియాంగ్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ డిగ్రీ చదివిన గుయెన్‌కు ఈ ఆర్ట్ ఏంటంటూ ప్రారంభంలో ఎన్నో అడ్డంకులు... అయినా కొన్నాళ్లకు తనది రైట్ ఛాయిస్ అని నిరూపించాడు.
చదవండి: పెరిగే వయసుకు కళ్లెం.. నిత్య యవ్వనం ఇక సులువే..
ఇప్పుడు వియత్నాం హెయిర్ స్టయిల్ ఇండస్ట్రీలో గుయెన్‌దో ప్రత్యేక ముద్ర. ఆయన డిజైన్ చేసే ఒక్కో హెయిర్ స్టైల్‌ఖరీదు... పది, పదిహేను, ఇరవై వేల వరకు ఉంటుంది. ఇక సాధారణ స్టయిల్ చేయడానికి ఒకటి నుంచి రెండు రోజులుపడితే... కొన్ని మాత్రం రెండు మూడు నెలల సమయం తీసుకుంటాయి. వియత్నాం హెయిర్ ఇండస్ట్రీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడం, తనలాంటి కళాకారులను ప్రోత్సహించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.
చదవండి: ‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి'
Comments
Please login to add a commentAdd a comment