hair saloon
-
Lok sabha elections 2024: ఓటేస్తే డిస్కౌంట్... ఫ్రీ హెయిర్ కట్!
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం! మన రాత మారాలన్నా, నేతల తలరాతలు మార్చాలన్నా మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం కోడై కూస్తోంది. అయినా కొందరిలో మాత్రం చలనం శూన్యం. అందుకే, ఈ ఓట్ల జాతరలో దుమ్మురేపేందుకు మేము సైతం అంటున్నారు కొందరు ఔత్సాహిక వ్యాపారులు. అటు ఓటింగ్ శాతం, ఇటు తమ వ్యాపారం పెరిగేలా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ‘ఓటేసి వేలిపై సిరా చుక్క చూపండి, డిస్కౌంట్ పొందండి’ అంటూ ఓటర్లను ఊరిస్తున్నారు. ఉత్తరాఖండ్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ తాజాగా ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రంలో 19న శుక్రవారం ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతాయి. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి 20వ తేదీ సాయంత్రం దాకా తమ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏం తిన్నా బిల్లులో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, వేలిపై సిరా గుర్తు చూపి డిస్కౌంట్ పొందచ్చొని అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ సాహ్ని చెబుతున్నారు. శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనున్న తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో కూడా ఓటేసిన వారికి పోలింగ్ రోజు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్, బేకరీలు.. ఇలా ఎక్కడ ఏం తిన్నా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఓటర్లను ప్రోత్సహించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.అరుణ్ రాజ్ చెప్పారు. ఇక కాంచీపురం కలెక్టర్ కలైసెల్వి మోహన్ వాటర్ బాటిళ్లపై పోలింగ్ సంబంధ పోస్టర్లను అతికించడం ద్వారా ఓటర్లలో చైతన్యం నింపుతున్నారు. ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరిగే మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్ అదిరిపోయే ఆఫరిచ్చాడు. ఓటేసి సిరా గుర్తు చూపిన వారికి తన సెలూన్లో ఫ్రీగా హెయిర్ కట్ చేస్తాననంటూ షాపు ముందు బోర్డు పెట్టేశాడు. మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనున్న జంషెడ్‌పూర్‌లో కూడా ఓటేసిన వారికి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డిస్కౌంట్ ఇచ్చేలా ఈసీ అధికారులు ఒప్పించారు. గత నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో 2,600 పై చిలుకు పోలింగ్ బూత్‌లకు ఫ్రీ రైడ్స్ ఆఫర్ చేయడం తెలిసిందే. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జూన్ 1 దాకా సుదీర్ఘంగా జరగనున్న నేపథ్యంలో ఆఫర్ల జోరు కూడా పెరిగేలా కనిపిస్తోంది! -
కొప్పున పువ్వులు పెట్టుకోవడం కాదు.. కొప్పునే పువ్వులా మార్చితే ఎలా ఉంటుందంటే?
‘‘పూల రెక్కలు.. కొన్ని తేనె చుక్కలు.. రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో’’అంటూ పూవులాంటి అమ్మాయిని పొగిడాడో సినీ కవి. కానీ ఆ పూల రెక్కలంత పలుచగా.. నిజమైన పువ్వేనేమో అన్నంత అం దంగా జుట్టును డిజైన్ చేయగలడీ హెయిర్‌డ్రెస్సర్. ఈ పూల కొప్పుల సృష్టికర్త వియత్నాంకు చెందిన 28 ఏళ్ల గుయెన్ ఫట్ ఫట్ ట్రి. ‘‘కొప్పున పువ్వులు పెట్టుకోవడం పాత పద్ధతి. కొప్పునే పువ్వులా దిద్దుకోవడం కొత్త స్టైల్’’అంటూ మందారం, చామంతి, లిల్లీ, లోటస్... ఇలా అనేక రకాల పూల డిజైన్లలో జుట్టును వేస్తున్నాడు. జియాంగ్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ డిగ్రీ చదివిన గుయెన్‌కు ఈ ఆర్ట్ ఏంటంటూ ప్రారంభంలో ఎన్నో అడ్డంకులు... అయినా కొన్నాళ్లకు తనది రైట్ ఛాయిస్ అని నిరూపించాడు. చదవండి: పెరిగే వయసుకు కళ్లెం.. నిత్య యవ్వనం ఇక సులువే.. ఇప్పుడు వియత్నాం హెయిర్ స్టయిల్ ఇండస్ట్రీలో గుయెన్దో ప్రత్యేక ముద్ర. ఆయన డిజైన్ చేసే ఒక్కో హెయిర్ స్టైల్ఖరీదు... పది, పదిహేను, ఇరవై వేల వరకు ఉంటుంది. ఇక సాధారణ స్టయిల్ చేయడానికి ఒకటి నుంచి రెండు రోజులుపడితే... కొన్ని మాత్రం రెండు మూడు నెలల సమయం తీసుకుంటాయి. వియత్నాం హెయిర్ ఇండస్ట్రీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడం, తనలాంటి కళాకారులను ప్రోత్సహించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. చదవండి: ‘ఆ పసి హృదయం ఎంతగా గాయపడిందో ఆ కళ్లే చెబుతున్నాయి' -
ఓరుగల్లులో సినిమా చేస్తా..
కాజీపేట అర్బన్: లవర్ బాయ్ ఇమేజ్‌తో గుర్తింపు పొందిన నేను త్వరలో అన్ని వర్గాల ప్రజలను మెప్పించేలా అందరిని ఆకట్టుకునే సినిమాతో ముందుకు వస్తానని సినీహీరో వరుణ్‌సందేశ్ తెలిపారు. హన్మకొండలో ఓ సెలూన్ షాప్ ప్రారంభోత్సవానికి శనివారం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా వరుణ్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. ఓరుగల్లు అంటే ఎంతో ఇష్టం చారిత్రక ఓరుగల్లు నగరంలో సినిమా చేయాలనుంది. గతంలో టూర్లో భాగంగా వరంగల్‌కు వచ్చాను. వేయిస్తంభాల దేవాలయం, రామప్ప, వరంగల్ ఫోర్ట్లతో పాటు నిట్ వరంగల్ చాలా ఇష్టమైన ప్రాంతాలు. హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ ఫాస్ట్‌గా అభివృద్ధి చెందుతున్నందున వర్షం, ఎంసీఏ వంటి చిత్రాలతో సినీ రంగానికి అనువుగా నిలుస్తున్న వరంగల్‌లో సినిమా చేస్తా. బిగ్‌బాస్–3 ఓపికను నేర్పించింది... ఎంతో కోపంగా, ఓపిక లేకుండా, ప్రతి అంశానికి రియాక్ట్ అయ్యే నన్ను బిగ్‌బాస్–3లో 105రోజుల ప్రయాణం ఓపిక నేర్పించింది. నేను వితిక భార్యభర్తలమైనా బిగ్‌బాస్–3లో కంటెస్ట్‌లుగా పోటాపోటీగా టాస్క్‌లు చేశాం. టాప్–5లో నేను సైతం ఉండడం బిగ్ బాస్ నాకు నేర్పిన, అందించిన ఓర్పు, ఓపికతోనే. నేను నా భర్యతో పాటు 15 మంది కంటెస్ట్‌లతో అనుభూతులు, అభిరుచులను, కోపాలు–తాపాలు, అనుభావాలను పంచుకుంటూ ఆత్మీయులుగా మారిపోయాం. బిగ్‌బాస్–3 జర్నీ నా జీవితంలో మరిచిపోలేని మధురానుభూతి. నిత్యం షూటింగ్లో బిజీగా ఉండే నేను నా భార్య వితిక ఒకే చోట వంద రోజులు మనోభావాలను పంచుకునే అవకాశాన్ని అందించిన బిగ్‌బాస్‌కు రుణపడి ఉంటా. నా సినిమాలను ఆదరించిన ప్రేక్షకులే నన్ను టాప్–5లో బిగ్‌బాస్‌లో నిలబెట్టారు. నా అభిమానుల అభిమానం ఎప్పటికీ మరిచిపోలేను. త్వరలో మల్టీస్టారర్... బిగ్‌బాస్–3 జర్నీ తర్వాత అనేక అవకాశాలు వస్తున్నాయి. పదికి పైగా స్టోరీలను విన్నాను. త్వరలో మల్టీస్టారర్ మూవీ, ఫ్యామిలీ, కామెడీ సినిమాలతో ముందుకు వస్తా. ‘సే నో టూ ప్లాస్టిక్’లో వరంగల్ ముందుండాలి యూఎస్‌లో ఉన్నప్పుడు అక్కడ ప్లాస్టిక్ వాడకం నిషేదంతో పర్యావరణ పరిరక్షణలో ముందుండగా ప్రస్తుతం వరంగల్ సే నో టూ ప్లాస్టిక్ అంటూ ప్లాస్టిక్ రహితంగా వరంగల్ ఫస్ట్‌గా నిలవాలి. ప్లాస్టిక్ వినియోగంతో అనేక రోగాలు వస్తున్నాయి, వాతావరణం కలుషితమౌతుంది. పర్యావరణానికి ముప్పుగా మారిని ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దామంటూ వరంగల్‌వాసులకు వరుణ్‌సందేశ్ తన సందేశ్(శా)న్ని అందించారు. -
కటింగ్ కోసం వచ్చి కత్తెరతో దాడి
-
బార్బర్లుగా మారిన నార్త్ ఇండియా ముస్లింలు