కేటీఆర్ హెయిర్ స్టైల్ మారింది గురూ! | is KTR change his hair style? | Sakshi
Sakshi News home page

కేటీఆర్ హెయిర్ స్టైల్ మారింది గురూ!

Published Mon, Feb 29 2016 7:48 PM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

కేటీఆర్ హెయిర్ స్టైల్ మారింది గురూ! - Sakshi

కేటీఆర్ హెయిర్ స్టైల్ మారింది గురూ!

హైదరాబాద్‌: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. పార్టీ గెలుపులో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. ఎన్నికల వేళ ఉరుకుపరుకులతో కనిపించిన ఆయన ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం చెప్పులు అరిగేలా తిరిగి ప్రజల మన్ననలు పొందిన కేటీఆర్ ఓట్లేసిన జనాలకు చేసే మంచి పనులకై అధికారులతో సుదీర్ఘ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.

అయితే, సోమవారం ఆశ్చర్యకరమైన సన్నివేశం కనిపించింది. ఎన్నడూ లేనిది కేటీఆర్ కొత్తగా కనిపించారు. ఈ చిత్రంలో ఆయన హెయిర్ స్టైల్ మారిపోయింది. ఎప్పుడూ తన జుట్టును పైకి దువ్వుతూ కనిపించే కేటీఆర్ సోమవారం తన హెయిర్ స్టైల్ తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా దువ్వి కనిపించారు. అంతేకాకుండా ఎంతో సహనంతో చుట్టూ తన తండ్రి కేసీఆర్ లాగే అధికారులను కూర్చోబెట్టుకొని వారితో సావధానంగా సమావేశం నిర్వహించుకుంటూ కనిపించారు. మారిన కేటీఆర్ క్రాఫ్ చూసి ఆయన అభిమానుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement