Sportsmanship
-
ఓటమిని ఒప్పుకోవడమే క్రీడాస్ఫూర్తి
పది వరుస విజయాల తర్వాత ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధానాన్ని ప్రభావితం చేసినందువల్ల... అతడిలో మనం ఆశించిన సౌమ్యతను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? 2021 యు.ఎస్. టెన్నిస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్... నొవాక్ జొకోవిచ్‌కి చాలా పెద్ద మ్యాచ్. అతడు ఆ మ్యాచ్‌ని గెలిస్తే ఒకే ఏడాదిలో మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్లలోనూ విజయం సాధించినట్లు అవుతుంది. అద్భుతంగా ఆడాడు. కానీ ఓడిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదేవ్‌ను మనస్ఫూర్తిగా అభినందించాడు. మన క్రికెటర్లు తమ ఓటమిని హూందాగా ఎలా స్వీకరించాలో నేర్చుకోవలసే ఉంది. పెద్దమనిషి అని ఒకర్ని అంచనా వేయడానికి ఉన్న అనేకమైన మార్గాలలో బహుశా అత్యంత సునిశి తమైనది... వారు ఓటమిలో సైతం సహజ నిశ్చల శాంత గాంభీర్యాన్ని కలిగి ఉండటమేనని నేను చెప్పగలను. ఇక ఆ పెద్దమనిషి క్రీడాకారుడు అయితే కనుక ఓటమిలోని అతడి నిశ్చలతకు మరింతగా ప్రాముఖ్యం ఉంటుంది. ఏదైనా మీరు తీవ్రంగా కోరుకున్నదీ, ‘మన చేతుల్లో పనే’ అనేంతగా మీరు తిరుగులేని నమ్మకంతో ఉన్నదీ... ఊహించని విధంగా మీ పట్టు నుంచి జారి, మిమ్మల్నొక కలలు కల్లలైన పరాజితునిగా మిగిల్చినప్పుడు మీ కదలి కలు, మీ కవళికలు ఎలా ఉంటాయన్నది మీ వ్యక్తిత్వంలోని నాణ్యత పాలును పైకి తేలుస్తుంది. గత ఆదివారం ఓటమి అనంతరం మన క్రికెట్ జట్టు నిలదొక్కుకోలేక పోయిన పరీక్ష ఇటువంటిదే. అందుకే నేను గుండెల్ని ముక్కలు చేసిన ఆ ప్రపంచ కప్పు పరాజయానికి భారత జట్టు ఎలా స్పందించిందో ఒక ఎంపికగా ఈ వారం రాయదలచాను. గొప్ప వీరులను మీరు మీ హృదయ పీఠాలపై ప్రతిష్ఠించుకున్నప్పుడే, వారి రూపాలను పంకిలపరిచే లోపాలను సైతం సమస్థాయిలో అంగీకరించడం అన్నది కూడా మీ ఆరాధనలోని ఒక తప్పనిసరి బాధ్యత అవుతుంది.. ముఖ్యంగా టీవీల ప్రత్యక్ష ప్రసారంలో వీరులైన మీ జగజ్జెట్టీలను ప్రపంచం అంతా కళ్లింత చేసుకుని చూస్తున్నప్పుడు! ‘‘భారతజట్టులోని చాలామంది ఆటగాళ్లు... విజేతలైన ఆసీస్ జట్టులోని క్రీడాకారులతో కరచాలనం చేసిన తర్వాత మైదానం విడిచిపెట్టారు. కనీసం ప్యాట్ కమిన్స్ ట్రోఫీని పైకెత్తి చూపడాన్ని వీక్షించేంత వరకైనా అక్కడ ఉండలేకపోయారు’’ అని మేథ్యూ సాల్విన్ ‘న్యూస్.కామ్.ఎయు’లో రాశారు. అదే నిజమైతే అటువంటి ప్రవర్తన అమర్యాదకరమైనది మాత్రమే కాదు, క్షమించరానిది కూడా! ఈ ధోరణి భారత జట్టును, భారత ప్రజలను కూడా చెడుగా ప్రపంచానికి చూపెడుతుంది. విరాట్ కోహ్లీ ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్’ అవార్డు అందు కున్నప్పుడు అతడి ప్రవర్తనను నాకు నేనుగా గమనించాను. అతడు నిరుత్సాహానికి గురవడాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ స్థాయికి తగని అతడి వైఖరి మాత్రం నేను అంగీకరించలేనిది. సచిన్ టెండూల్కర్‌తో మాత్రమే కరచాలనం చేసి, తక్కిన వాళ్లలో ఒక్కర్ని కూడా కోహ్లీ పట్టించుకోలేదు. అది అమర్యాద మాత్రమే కాదు, క్షమార్హం కాని స్వీయాధిక్య భావన కూడా! కోహ్లీని మాత్రమే నేనెందుకు వేరు చేసి చూస్తున్నాను? రెండు కారణాల వల్ల. కోట్లాది మందికి అతడు హీరో. తన ఆదర్శపాత్రను గొప్ప సంపదగా సృష్టించుకున్నవాడు. అతడేం చేస్తే వాళ్లు దానిని అనుసరిస్తారు. అంతేనా, అనుకరిస్తారు కూడా! అందుకే అతడి తప్పి దాలు కనిపించకుండా పోవు. ఒక స్టార్‌గా అతడు ప్రశంసలకు ఎలాగైతే అర్హుడో, విమర్శలకూ అంతే యోగ్యుడు. నేను కఠినంగా మాట్లాడుతున్నానని మీరు అనవచ్చు. పది వరుస విజయాల తర్వాత ఫైనల్లో ఓడిపోవడం హఠాత్ఘాతమే. తట్టుకోలేని దెబ్బే. అయితే అది ఒక వ్యక్తి ప్రవర్తనను, ప్రవర్తన విధా నాన్ని ప్రభావితం చేసినందువల్ల అతడిలో మనం ఆశించిన సౌమ్య తను, మర్యాదను అతడు విస్మరిస్తే దానిని మనం చూసీ చూడనట్లు వదిలేయాలా? అది నాకు సమ్మతి కాని వాదన. ఎందుకో నన్ను చెప్పనివ్వండి. 2021 యు.ఎస్. టెన్నిస్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్... నొవాక్ జొకోవిచ్‌కి చాలా పెద్ద మ్యాచ్. అందరి మదిలోనూ ఒకటే, అతడు ఆ మ్యాచ్‌ని గెలిస్తే ఒకే ఏడాదిలో అది అతడి నాలుగో గ్రాండ్ స్లామ్ విజయం అవుతుంది. 1969 నాటి రాడ్ లేవర్ ఘనతకు అతడిని సమం చేస్తుంది. పురుషుల టెన్నిస్‌లో ఒక ఏడాదిలోని గ్రాండ్ స్లామ్‌లు అన్నింటిలో విజయం సాధించిన మూడవ వ్యక్తిగా చరిత్రలో నిలుస్తాడు. కానీ ఏమైంది? ఓడిపోయాడు! ఏ లెక్కన చూసినా గత ఆదివారం విరాట్ కోహ్లీ చవి చూసిన ఓటమి కన్నా కూడా జొకోవిచ్ది చాలా పెద్ద ఓటమి. అంతేకాదు – అది చిన్న సంగతేం కాదు – పైగా వ్యక్తిగతమైనది. కనుక అది అసలు సిసలు పరీక్ష. జొకోవిచ్ అద్భుతంగా ఆడాడు. సందేహమే లేదు. అందుకే ఓటమి అతడిని కుంగదీసింది. అతడి కళ్లలో నీళ్లు చిప్పిల్లాయి. డేనియల్ మెద్వెదేవ్ అతడిని ఓడించిన క్షణాలలో జెకోవిచ్ అతడితో ఏమన్నాడో చూడండి: ‘‘ఈ గ్రాండ్ స్లామ్ టైటిల్‌కు అర్హులు ఎవరైనా ఉన్నారంటే అది మీరు మాత్రమే. చక్కగా ఆడారు. నిజంగానే చాలా చక్కగా! మంచి సమన్వయంతో ఉన్నారు. గ్లాండ్ స్లామ్ ప్రస్తుత పర్య టనల్లోని గొప్ప ఆటగాళ్లలో మీరు ఒకరు. మన మధ్య మంచి స్నేహపూర్వకమైన పోటీ నడిచింది. మీరింకా మరిన్ని గ్లాండ్ స్లామ్‌లు గెలవాలని, మరిన్ని మేజర్ లీగ్స్‌లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. మళ్లీ కూడా మీరు ఇలాంటి విజయాన్ని నిశ్చయంగా సాధించ గలరని నేను కచ్చితంగా చెప్పగలను’’ అని మెద్వేదేవ్ను మనస్ఫూర్తిగా అభినందించాడు జొకోవిచ్. అదీ క్రీడాస్ఫూర్తి అంటే. అదీ పెద్దరికం అంటే. దురదృష్టవశాత్తూ గతవారం మన క్రికెట్ జట్టు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది. ఇక జొకోవిచ్ ప్రేక్షకులను ఉద్దేశించి ఏమన్నాడో తెలుసా! ‘‘నేను మ్యాచ్ గెలవనప్పటికీ ఈ రాత్రి నా హృదయం పట్టనలవి కాని ఆనందంతో నిండి ఉందని మీకు చెప్పాలనుకుంటున్నాను. మీ అభిమానంతో మీరు నాకు కలిగించిన ప్రత్యేకమైన అనుభూతి కారణంగా నేనిప్పుడు భూమి మీద జీవించి ఉన్నవారిలో అత్యంత సంతో షకరమైన వ్యక్తిని. మీరు నా హృదయాన్ని స్పృశించారు. న్యూయార్క్‌లో నేనెప్పుడూ ఇలా లేను. నిజాయతీగా చెబుతున్నాను. నేను మీ అందరినీ ప్రేమిస్తున్నాను మిత్రులారా! నాకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నాకోసం చేసిన ప్రతిదానికీ కూడా’’ అని ఉద్వేగంగా మాట్లాడాడు. మన క్రికెటర్లు– ప్రధానంగా కోహ్లీ – గొప్ప క్రీడాకారులే అయినప్పటికీ వారు తమ ఓటమిని హుందాగా ఎలా స్వీకరించాలో నేటికింకా నేర్చుకోవలసే ఉంది. ఇందుకు రెండు కావాలి. మొదటిది క్రీడా పరాక్రమం. రెండోది శ్రేష్ఠమైన అంతఃచేతనాశక్తి. రెండోది లేకుండా మాత్రం నిజంగా మీరు గొప్పవారు కాలేరు. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
మనసులు గెలుచుకున్న పారా కరాటే ఛాంపియన్
కౌలాలంపూర్: చిన్న గెలుపును కూడా ధూమ్ ధామ్ చేస్తూ ఆర్భాటంగా జరుపుకునే రోజులివి. అలాంటిది తన గెలుపును తనతో పాటు ఓడిన వ్యక్తితో కలిపి జరుపుకుని అసలైన ఛాంపియన్ గా నిలిచాడు పారా కరాటే ఛాంపియన్ ఫర్జాద్ సఫావి. మలేషియాలోని మెలాకాలో జరిగిన ఏషియన్ పారా కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో హృదయాలను కదిలించే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. పారా కరాటే చాంపియన్ షిప్ పోటీల్లో ఇరాన్ ఆటగాడు ఫర్జాద్ సఫావి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడని ప్రకటించగానే అతడు మొదట ప్రేక్షకులకు సంప్రదాయబద్ధంగా వంగి అభివాదం చేశాడు. అనంతరం ఫైనల్లో తనపై ఓటమి పాలై రన్నరప్ గా నిలిచిన ఆటగాడు స్టేజి విడిచి వెళ్తోన్న విషయాన్ని గమనించి పరుగున అతడి వద్దకు వెళ్లి అతని చేతిని పైకి ఎత్తి తన విజయాన్ని అతనికి కూడా ఆపాదించాడు. దీంతో ఈ వీడియో చూసిన వారంతా ఛాంపియన్ ఆటగాడు ఛాంపియన్ లా వ్యవహరించాడంటూ అతడిపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ దృష్యాన్ని చూసిన వారెవరైనా భావోద్వేగానికి లోనుకావడం ఖాయం. శుభాకాంక్షలు ఫర్జాద్ క్రీడాస్ఫూర్తి అంటే ఏంటో చూపించావు. దయార్ద హృదయంతో మా హృదయాలను గెలుచుకున్నావు. నుసిక్యూ అసలైన చాంపియన్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by Good News Movement (@goodnews_movement) ఇది కూడా చదవండి: నాన్న చనిపోయారు.. కానీ ఆయన గుండె చప్పుడు విన్నారు.. -
'బెయిర్ స్టో అమాయక చక్రవర్తి.. బ్రాడ్ కపట సూత్రధారి'
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు ముగిసి రెండు రోజులు కావొస్తుంది. మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించినప్పటికి బెయిర్ స్టో ఔట్ వివాదం ఎక్కువగా హైలెట్ అయింది. ఈ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. బెయిర్ స్టో ఔట్ విషయంలో కీలకపాత్ర పోషించిన అలెక్స్ కేరీ తాజాగా ఒక బ్రాడ్‌తో జరిగిన సంభాషణను రివీల్ చేశాడు. బ్రాడ్ అన్న ఒకే ఒక్క మాటను అలెక్స్ కేరీ పంచుకున్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం బ్రాడ్.. అలెక్స్ కేరీ వద్దకు వచ్చి ''క్రీడాస్పూర్తిని దిగజార్చారు.. మీరంతా ఎప్పటికీ గుర్తుండి పోతారు'' అని పేర్కొన్నాడు. దీనిపై అలెక్స్ కేరీ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ''బెయిర్‌స్టో ఒక అమాయక చక్రవర్తి. బ్రాడ్ పెద్ద కపటనాటక సూత్రధారి. స్టువర్ట్ బ్రాడ్ నుంచి క్రీడా స్ఫూర్తి వంటి పదాలు వింటుంటే వింతగా ఉంది. వారి వికెట్ల కోసం అంపైర్లకు అప్పీల్ చేయాల్సిన అవసరం లేదని భావించే ఆటగాళ్లు ఇప్పుడు ఇలా చెప్పడం హాస్యాస్పదం. ఇంగ్లండ్ ఆటగాళ్లకు తమకొచ్చేసరికి రూల్స్ వేరేగా ఉంటాయి. అదే ప్రత్యర్థి విషయంలో మాత్రం క్రీడాస్ఫూర్తి గుర్తుకొస్తుంది'' అంటూ కామెంట్ చేశాడు. ఇక అభిమానులు మాత్రం ఈ సంఘటనను అంత త్వరగా మరిచిపోలేరనుకుంటా. గతంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ల సందర్భంగా జరిగిన సంఘటనలను గుర్తుకు తెస్తూ పలు వీడియోలను రిలీజ్ చేశారు. అందులో భాగంగా 2013 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్ క్యాచ్ ఔట్ అని స్పష్టంగా తెలిసినా మైదానం వీడేందుకు మొగ్గు చూపలేదు. అంపైర్స్ కాల్ కోసం వేచి చూశాడు. ఇప్పుడు ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చదవండి: 'ఎదుటోళ్లను విమర్శించే ముందు మీ కపటత్వం తెలుసుకోండి' మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇంగ్లండ్‌కు భారీ షాక్.. సిరీస్ మొత్తానికి కీలక ప్లేయర్ దూరం -
పూనమ్‌పై ప్రశంసలు.. ‘నేనైతే అస్సలు అలా చేసేదాన్ని కాదు’
Beth Mooney Commnets On Punam Raut dismissal: ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్ట్‌లో భారత మహిళా జట్టు బ్యాటర్ పూనమ్ రౌత్ ప్రదర్శించిన క్రీడా స్పూర్తి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది. రెండో రోజు భారత్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఆసీస్ బౌలర్ మోలిన్యూక్స్ వేసిన బంతిని పూనమ్ ఆడేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్‌ను తాకి నేరుగా కీపర్ హీలీ చేతిలోకి వెళ్లింది. కీపర్‌తో పాటు ,ఆసీస్ క్రికెటర్లు అందరూ అవుట్ అని అప్పీల్ చేయగా.. అంపైర్ మాత్రం నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా తాను ఔటయినట్టు నిర్ధారించుకున్న రౌత్ పెవిలియన్ బాట పట్టింది. ఈ సిరీస్‌లో డీఆర్ఎస్ కూడా అందుబాటులో లేదు. అయినప్పటకీ మైదానాన్ని వదిలి వెళ్లి ఆసీస్ క్రికెటర్లను సైతం పూనమ్ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ మాట్లాడుతూ.. ఒక వేళ ఆమె స్ధానంలో నేను ఉంటే అస్సలు గ్రౌండ్‌ని వదిలి వేళ్లేదాన్ని కాదని తోటి ఆటగాళ్లతో మాట్లాడింది. ఈ సంభాషణ అంతా స్టంప్ మైక్రోఫోన్లో రికార్డయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే... భారత్ ఆడుతున్న తొలి డే నైట్ టెస్టులో సెంచరీ సాధించి స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. మంధాన 216 బంతుల్లో 22 ఫోర్లు, 1 సిక్స్‌తో 127 పరుగులు సాధించింది. వర్షంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి భారత మహిళల జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 101.5 ఓవర్లలో 5 వికెట్లకు 276 పరుగులు చేసింది. Unbelievable scenes 😨 Punam Raut is given not out, but the Indian No.3 walks! #AUSvIND | @CommBank pic.twitter.com/xfAMsfC9s1 — cricket.com.au (@cricketcomau) October 1, 2021 చదవండి: Virender Sehwag: ‘ఇక చాలు... ఈసారి ముంబై అస్సలు పైకి రావొద్దు’ -
ఔటవ్వాల్సింది బతికిపోయాడు.. కృనాల్, రోహిత్ క్రీడాస్పూర్తి
Rohit Sharma And Krunal Pandya Great Sportsmanship.. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, కింగ్స్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కృనాల్ పాండ్యా, రోహిత్ శర్మలు ప్రదర్శించిన క్రీడాస్పూర్తికి ఫ్యాన్స్‌తో పాటు కేఎల్ రాహుల్ కూడా ఫిదా అయ్యాడు. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ 6వ ఓవర్ కృనాల్ పాండ్యా బౌలింగ్ చేశాడు. ఓవర్ చివరి బంతిని గేల్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రాహుల్ అడ్డుగా రావడంతో అతని చేతికి బంతి తగిలి కృనాల్ వైపు వెళ్లింది. కాగా అప్పటికే రాహుల్ క్రీజుదాటి బయటికి వెళ్లడం.. కృనాల్ బంతిని వికెట్ల మీదకు విసరడం జరిగిపోయాయి. చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు Courtesy: IPL Twitter వాస్తవానికి కేఎల్ రాహుల్ అవుటవ్వాల్సిందే. అంపైర్ కూడా థర్డ్ అంపైర్‌కు సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. అయితే రాహుల్ ఏంటిది అన్నట్లుగా కృనాల్ వైపు చూశాడు. కృనాల్ కూడా అంపైర్ వద్దకు వెళ్లి తన అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పాడు. ఆ తర్వాత రోహిత్‌కు కూడా అప్పీల్ వద్దంటూ వివరించాడు. దీంతో రోహిత్ వెనక్కి తగ్గాడు. ఓవర్ ముగిసిన తర్వాత కేఎల్ రాహుల్ కృనాల్, రోహిత్‌ల వైపు చూస్తూ థ్యాంక్స్ అనే అర్థం వచ్చేలా బొటనవేలితో థంప్సమ్ గుర్తు చూపించాడు. అలా రాహుల్ ఔటవ్వాల్సినప్పటికీ.. రోహిత్, పాండ్యాలు క్రీడాస్పూర్తి ప్రదర్శించడంతో బతికిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ తర్వాత రాహుల్ 21 పరుగులు చేసి పొలార్డ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. Courtesy: IPL Twitter కాగా మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల నిలకడైన బౌలింగ్‌కు పంజాబ్ పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఎయిడెన్ మక్రమ్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపక్ హుడా 28 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, పొలార్డ్ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్, రాహుల్ చహర్ తలా ఒక వికెట్ తీశారు. చదవండి: IPL 2021: కొద్దిలో తప్పించుకున్నాడు.. లేదంటే మొహం పచ్చడయ్యేది pic.twitter.com/7YsM7OyL4w — Simran (@CowCorner9) September 28, 2021 -
జొకోవిచ్ నాలుగోసారి...
మొనాకో: అద్భుత ఫామ్‌తో వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకున్న సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రతిష్టాత్మక 2019 లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల్లో అతను ప్రపంచ ఉత్తమ క్రీడాకారుడిగా నిలిచాడు. అతను ఈ అవారున్డు గెలుచుకోవడం నాలుగోసారి కావడం విశేషం. దీంతో జమైకా మేటి అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రికార్డును జొకో సమం చేయగా... ఫెడరర్ ఐదు లారెస్ అవార్డులతో అగ్రస్థానంలో ఉన్నాడు. గత సంవత్సరం వింబుల్డన్, యూఎస్ ఓపెన్ సాధించడంతో పాటు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన జొకోవిచ్ ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 68 మంది సభ్యుల లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అకాడమీ 2018లో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుంటూ విజేతలను ఎంపిక చేసింది. అమెరికాకు చెందిన టాప్ జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ ‘స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికైంది. గత ఏడాది వరల్డ్ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచిన ప్రదర్శనకు ఈ అవార్డు దక్కింది. ‘టీమ్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ‘ఫిఫా’ ప్రపంచ కప్ గెలుచుకున్న ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టుకు లభించింది. టెన్నిస్‌లో మహిళల వరల్డ్ నంబర్‌వన్ నయోమి ఒసాకా (జపాన్)కు ‘బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్’ అవార్డు లభించింది. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచే క్రమంలో దిగ్గజ క్రీడాకారిణి సెరెనాపై ఫైనల్లో సాధించిన విజయం ఆమెకు ఈ అవార్డు తెచ్చి పెట్టింది. మారథాన్‌లో ప్రపంచ రికార్డు (2 గంటల 1.39 నిమిషాలు) నెలకొల్పిన ఇలియుడ్ కిప్జోగె (కెన్యా)ను లారెస్ ‘ప్రత్యేక ఘనత’ అవార్డుతో సత్కరించింది. 22 ఏళ్ల పాటు ఫుట్‌బాల్ క్లబ్ అర్సెనల్కు మేనేజర్‌గా వ్యవహరించిన ఆర్సెన్ వెంగర్కు ‘లైఫ్ టైం అచీవ్మెంట్’ అవార్డు లభించింది. వినేశ్‌కు నిరాశ... లారెస్ స్పోర్ట్స్ అవార్డులకు నామినేట్ అయిన తొలి భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందిన మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ‘కమ్ బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కలేదు. రియో ఒలింపిక్స్‌లో తీవ్రంగా గాయపడిన వినేశ్... ఆ తర్వాత కోలుకొని గత ఏడాది కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు సాధించడంతో ఈ అవార్డుకు నామినేట్ అయింది. ఈ విభాగంలో అమెరికా గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్‌కు అవార్డు దక్కింది. ఐదేళ్ల విరామం తర్వాత అతను టూర్ చాంపియన్‌షిప్ సాధించడం విశేషం. ‘యువ’కు అవార్డు జార్ఖండ్ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందిన అమ్మాయిల జీవితాల్లో క్రీడల ద్వారా మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘యువ’కు ‘స్పోర్ట్ ఫర్ గుడ్ అవార్డ్’ దక్కింది. 2009లో ఈ సంస్థను అమెరికాకు చెందిన ఫ్రాన్జ్ గాస్ట్లర్ స్థాపించాడు. ఇక్కడ దాదాపు 450 మంది అమ్మాయిలు ఫుట్‌బాల్‌లో శిక్షణ పొందుతున్నారు. 2015లో ‘యువ’ స్కూల్‌ను ప్రారంభించి ఆటతో పాటు చదువు కూడా చెబుతున్నారు. వీరంతా ప్రొఫెషనల్స్ తరహాలో ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొనకపోయినా... బాల్య వివాహాలు, అక్రమ రవాణావంటి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా అమ్మాయిలను తీర్చిదిద్దుతారు. కార్యక్రమంలో ‘యువ’ తరఫున హిమ, నీతా, రాధ, కోనిక అవార్డును స్వీకరించారు. -
విండీస్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదు
1980, 90 దశకాల్లో వెస్టిండీస్ జట్టు ప్రపంచ క్రికెట్‌ను శాసించినప్పటికీ ఒక్కోసారి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగానే ఆడిందని దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా అంగీకరించారు. నంబర్‌వన్‌గా ఉన్న జట్టు అందరికీ ఆదర్శంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని లారా పేర్కొన్నారు. ‘ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’పై ఉపన్యాసం ఇస్తూ లారా ఈ వ్యాఖ్యాలు చేశారు. 1988లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించేందుకు విండీస్‌కు అంపైర్ పొరపాట్లే సహకరించాయని ఆయన గుర్తు చేశారు. -
క్రీడాస్ఫూర్తిని నింపిన రన్
4వేల మంది హాజరు కిక్కిరిసిన కైకలూరు రహదారులు రన్లో పాల్గొన్న ఎంపీ మాగంటి కైకలూరు :అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా కైకలూరులో సోమవారం నిర్వహించిన ఒలింపిక్ రన్ క్రీడా స్ఫూర్తిని నింపింది. జిల్లా క్రీడాధికార సంస్థ, ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ రన్లో పలు విద్యాసంస్థలకు చెందిన సుమారు 4వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఉదయం డిగ్రీ కాలేజీకి చెందిన ఒక బ్యాచ్‌ను ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు), ఏలూరురోడ్డు వద్ద మరో బ్యాచ్‌ను మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ప్రారంభించారు. రెండు బ్యాచ్‌ల్లోని నాయకులు, విద్యార్థులు కాగడాలతో తాలూకా సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన సభా వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాగంటి మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు. జిల్లా క్రీడాధికారి రామకృష్ణ మాట్లాడుతూ కైకలూరులో స్టేడియం నిర్మాణానికి రూ.2.10 కోట్ల నిధులు మంజూరయ్యూయని చెప్పారు. స్థల సేకరణ జరిగితే పనులు ప్రారంభిస్తామన్నారు. జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసానికి ప్రతీకలన్నారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు మాట్లాడుతూ కైకలూరు నుంచి వడ్లమన్నాటి పాండురంగారావు, మండవల్లి నుంచి మార్తమ్మ వంటి వారు జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభ చూపారని, వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కేపీ రావు మాట్లాడుతూ 2018లో నిర్వహించే ఒలింపిక్ గేమ్స్‌ను మన రాష్ట్రంలో నిర్వహించాలంటూ బిడ్ వేయనున్నట్లు చెప్పారు. కైకలూరులో రాష్ట్రస్థాయి పోటీలు త్వరలో నిర్వహిస్తామన్నారు. స్థానిక ఒలింపిక్ నిర్వహణ కమిటీ సభ్యుడు కేవీఎన్‌ఎం నాయుడు మాట్లాడుతూ కైకలూరులో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారన్నారు. కైకలూరు కరాటే మాస్టర్ ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో రన్లో పాల్గొన్నవారికి తాగునీరు, బిస్కెట్లు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ రన్ నిర్వహణ కమిటీ సభ్యులు గురజాడ ఉదయశంకర్, ఎంఏ రహీమ్, పీఈటీలు లూయిస్, లక్ష్మణరావు, శ్రీనివాసరావు, పీడీ సత్యనారాయణ, సర్పంచి నర్సిపల్లి అప్పారావు, జెడ్పీటీసీ బొమ్మనబోయిన విజయలక్ష్మి, నాయకులు చలమలశెట్టి రామానుజయ్య, మార్కెట్‌యార్డు చైర్మన్ సామర్ల శివకృష్ణ, న్యాయవాది కారి శరత్‌బాబు, సయ్యపురాజు గుర్రాజు, నేషనల్, జాగృతి, భాష్యం, చైతన్య, హోలిక్రాస్, కేపీఎస్, భుజబలపట్నం, కానుకొల్లు, కైకలూరు ప్రభుత్వ బాలుర, బాలికల హైస్కూళ్లు, ఓరియంటల్ హైస్కూల్, వికాస్, విద్యాంజలి కాలేజీలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.