విండీస్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదు
1980, 90 దశకాల్లో వెస్టిండీస్ జట్టు ప్రపంచ క్రికెట్‌ను శాసించినప్పటికీ ఒక్కోసారి క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగానే ఆడిందని దిగ్గజ బ్యాట్స్‌మన్ బ్రియాన్ లారా అంగీకరించారు. నంబర్‌వన్‌గా ఉన్న జట్టు అందరికీ ఆదర్శంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంటుందని లారా పేర్కొన్నారు.
‘ఎంసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్’పై ఉపన్యాసం ఇస్తూ లారా ఈ వ్యాఖ్యాలు చేశారు. 1988లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించేందుకు విండీస్‌కు అంపైర్ పొరపాట్లే సహకరించాయని ఆయన గుర్తు చేశారు.