ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఏడో బ్యాటర్‌గా జో రూట్ రికార్డులకెక్కాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటివరకు 143 మ్యాచ్ (261 టెస్టు ఇన్నింగ్స్‌లు) లు ఆడిన రూట్ 11954 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. లారా 131 మ్యాచ్‌ల్లో 11953 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో లారా ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు.
ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15,921) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానాల్లో రికీ పాంటింగ్(13,378), జాక్వెస్ కల్లిస్(13, 289), రాహుల్ ద్రవిడ్(13,288), అలిస్టర్ కుక్(12,472), కుమార్ సంగక్కర(12,400) ఉన్నారు. ఇక విండీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 87 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ టెస్టు కెరీర్‌లో 32 సెంచరీలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment