ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అదరగొట్టాడు. కేన్ విలియమ్సన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన రూట్.. మరోసారి నంబర్ వన్ ర్యాంకు దక్కించుకున్నాడు.
సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తంగా 291 పరుగులతో రాణించిన రూట్.. ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో మొత్తంగా 872 రేటింగ్ పాయింట్లు సాధించి ప్రథమ స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో మరోసారి వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచాడు.
కాగా ఈ 33 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ తొలిసారిగా 2015 ఆగష్టులో అగ్రపీఠం కైవసం చేసుకున్నాడు. గతేడాది కూడా మొదటి ర్యాంకు సంపాదించాడు. ఇక తాజా టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో బాబర్ ఆజం, డారిల్ మిచెల్, స్టీవెన్ స్మిత్ టాప్-5లో కొనసాగుతున్నారు. భారత్ నుంచి రోహిత్ శర్మ ఒక స్థానం మెరుగుపరచుకుని ఆరో ర్యాంకులో నిలిచాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐసీసీ మెన్స్ టెస్టు తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్-5 ప్లేయర్లు
1. జో రూట్(ఇంగ్లండ్)- 872 రేటింగ్ పాయింట్లు
2. కేన్ విలియమ్సన్(న్యూజిలాండ్)- 859 రేటింగ్ పాయింట్లు
3. బాబర్ ఆజం(పాకిస్తాన్)- 768 రేటింగ్ పాయింట్లు
4. డారిల్ మిచెల్(న్యూజిలాండ్)- 768 రేటింగ్ పాయింట్లు
5. స్టీవెన్ స్మిత్(ఆస్ట్రేలియా)- 757 రేటింగ్ పాయింట్లు.
Comments
Please login to add a commentAdd a comment