West Indies Vs England Test Series- Fans Trolls Joe Root Captaincy: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సారథ్య బాధ్యతల నుంచి వైదొలగాల్సిన సమయం వచ్చిందంటూ ఇంగ్లండ్ మాజీ సారథులు, అభిమానులు అతడిని ఏకిపారేస్తున్నారు. ఇదేం కెప్టెన్సీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఘోర పరాభవం(4-0), ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఓటమి నేపథ్యంలో రూట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.
కాగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ వెస్టిండీస్ టూర్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మొదటి రెండు టెస్టులు డ్రా కాగా... నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో స్ఫూర్తిదాయక ఆటతో ఆతిథ్య విండీస్ విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను మట్టి కరిపించి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో మరోసారి ఇంగ్లండ్‌కు చేదు అనుభవం మిగిలింది.
ఇక యాషెస్ సహా గత ఐదు సిరీస్‌లలో ఇంగ్లండ్‌కు ఇలాంటి ఫలితాలే వచ్చాయి. ఆడిన 17 మ్యాచ్‌లతో కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జో రూట్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు నాసిర్ హుసేన్, మైఖేల్ వాన్ తదితరులు రూట్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డారు.
ఇంగ్లండ్ జట్టు అభిమానులు సైతం రూట్‌పై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నువ్వొక చెత్త కెప్టెన్‌వి. వేస్ట్.. చాలు ఇంక.. దయచేసి కెప్టెన్ పదవి నుంచి దిగిపో! మరీ ఇంత దారుణ ప్రదర్శనా!? అస్సలు ఊహించలేదు’’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: IPL 2022: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్! మొదటి తప్పిదం కాబట్టి..
World Cup 2022: అంతా నువ్వే చేశావు హర్మన్.. కానీ ఎందుకిలా? మా హృదయం ముక్కలైంది!
#MaroonMagic.✨ That's the caption. #WIvENG pic.twitter.com/oE8qDumyQ6
— Windies Cricket (@windiescricket) March 27, 2022
Comments
Please login to add a commentAdd a comment