WI Vs Eng 2nd Test: జో రూట్‌, స్టోక్స్‌ అద్భుత సెంచరీలు.. ఇంగ్లండ్‌దే పైచేయి | WI Vs Eng 2nd Test: Ben Stokes Remarkable Century England Command On Day 2 | Sakshi
Sakshi News home page

WI Vs Eng 2nd Test: జో రూట్‌, స్టోక్స్‌ అద్భుత సెంచరీలు.. ఇంగ్లండ్‌దే పైచేయి

Published Fri, Mar 18 2022 10:20 AM | Last Updated on Fri, Mar 18 2022 10:37 AM

WI Vs Eng 2nd Test: Ben Stokes Remarkable Century England Command On Day 2 - Sakshi

జో రూట్‌, స్టోక్స్‌ అద్భుత సెంచరీలు(PC: ECB)

WI Vs Eng 2nd Test- బ్రిడ్జ్‌టౌన్‌: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్‌ జో రూట్‌ (316 బంతుల్లో 153; 14 ఫోర్లు), బెన్‌ స్టోక్స్‌ (128 బంతుల్లో 120 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 129 పరుగులు జోడించారు. డాన్‌ లారెన్స్‌ (150 బంతుల్లో 91; 13 ఫోర్లు, 1 సిక్స్‌) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో భారీ స్కోరు సాధించిన పర్యాటక ఇంగ్లండ్‌ 9 వికెట్ల నష్టానికి 507 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది.

ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్‌ 27 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 71 పరుగులు చేసింది. కెప్టెన్‌ క్రెయిగ్‌ బ్రెత్‌వైట్‌ (28 పరుగులు), వన్‌డౌన్లో వచ్చిన బ్రూక్స్‌ 31 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా 128 బంతుల్లో 120 పరుగులు చేసిన బెన్‌ స్టోక్స్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘‘అద్భుతమైన ఇన్నింగ్స్‌.. 114 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ. పూర్తిస్థాయి ఆధిపత్యం. నువ్వు సూపర్‌ స్టోక్స్’’ అంటూ కొనియాడుతున్నారు.  కాగా ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. 
చదవండి: Ranji Trophy 2022: ధోని హోం టీమ్‌ ప్రపంచ రికార్డ్.. ఏకంగా 1008 పరుగుల ఆధిక్యం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement