సౌతాంప్టన్ : 'నాకు తొలిసారి జట్టుకు నాయకత్వం వహించడం కంటే జట్టును గెలిపించడంపైనే ఎక్కువగా దృష్టి సారించినట్లు ' ఇంగ్లండ్ టెస్టు జట్టు తాత్కాలిక కెప్టెన్ బెన్ స్టోక్స్ అంటున్నాడు. కరోనా నేపథ్యంలో దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత క్రికెట్‌లో ఇంగ్లండ్- విండీస్‌ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సౌతాంప్టన్ వేదికగా నిలిచింది. కాగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా ఇరు జట్ల మధ్య బుధవారం (జూలై 8న) మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ టెస్టు జట్టు రెగ్యులర్ కెప్టెన్ జో రూట్ గైర్హాజరీలో తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్టోక్స్ లండన్ దినపత్రిక మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అంతరంగాన్ని పంచకున్నాడు. ('అదే నన్ను ధోని అభిమానిగా మార్చింది')
'రేపు(బుధవారం).. నా జీవితంలో గుర్తుండిపోయే రోజు. ఎందుకంటే తొలిసారి జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత క్రికెట్‌లో మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే నాకు కెప్టెన్సీ కన్నా జట్టు గెలుపే ముఖ్యం.రెగ్యులర్ కెప్టెన్ గైర్హాజరీలో నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించడం నా కర్తవ్యం.. కానీ దృష్టి మొత్తం మ్యాచ్ గెలవాలనే దానిపైనే ఉంది. ఎందుకంటే ఇంగ్లండ్- విండీస్‌ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌లో గెలుపొందిన జట్టుకు ప్రఖ్యాత విజ్డెన్ ట్రోపీ అందిస్తారు. 2019లో విండీస్ ఆ ట్రోపినీ ఎగరేసుకపోయింది. అప్పుడు జట్టులో సభ్యునిగా ఉన్నా.. కానీ ఇప్పుడు మాత్రం కెప్టెన్‌గా ఉన్నా. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లండ్‌కు కప్‌ను సాధించి పెట్టాలి.(నువ్వు బహుమతులకు లొంగని వ్యక్తివి)
ఈ సమయంలో నేను కోరుకునేది ఒక్కటే.. అదేంటంటే మొదటి మ్యాచ్‌లో జట్టు గెలుపుకోసం మా ఆటగాళ్లంతా వంద శాతం నిబద్ధతను ప్రదర్శిస్తారని ఆశిస్తున్నా. ప్రస్తుతం నేను ఒక్క మ్యాచ్‌కే కెప్టెన్‌గా ఉన్నా.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌లో ఆధిక్యంలో నిలుస్తాం.' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా రేపు జరగనున్న మొదటి టెస్టు మ్యాచ్‌కు ఇరు జట్లు సన్నద్ధమయ్యాయి. గ్యాలరీలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ జరగనుంది.. దీనికి బదులుగా ఆడియెన్స్ రికార్డింగ్ సౌండ్స్ ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో మైదానం నలువైపులా శానిటైజర్ స్టాండ్లను ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment