నాటింగ్‌హామ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 122 పరుగులు చేసిన రూట్.. ఇంగ్లండ్ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. రూట్‌కు ఇది 32వ టెస్టు సెంంచరీ కావడం విశేషం.
ఈ నేపథ్యంలో రూట్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖల్ వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడని వాన్ అభిప్రాయపడ్డాడు.
"జో రూట్ మరి కొద్ది రోజుల్లోనే టెస్టుల్లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. అంతేకాదు టెస్టు క్రికెట్ హిస్టరీలో లీడింగ్ రన్‌స్కోరర్ అయిన సచిన్ టెండూల్కర్‌ను కూడా అధిగమించే సత్తా రూట్‌కు ఉంది. ఇప్పటికే సచిన్ రికార్డుకు రూట్ చేరవయ్యే వాడు.
కానీ ఆ మధ్య కాలంలో రూట్ తన ఫామ్‌ను కోల్పోయి కాస్త ఇబ్బంది పడ్డాడు. నిర్లక్ష్యంగా షాట్‌లు ఆడుతూ తన వికెట్‌ను కోల్పోయేవాడు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం అతడు అద్భుతంగా ఆడాడు. ఇప్పుడు మాత్రం అతడు తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దూకుడుగా ఆడుతున్నాడు.
ఇదే కొనసాగితే సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేసే అవకాశముందని" ది టెలిగ్రాఫ్ కోసం తన కాలమ్‌లో వాన్ రాసుకొచ్చాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రూట్ ప్రస్తుతం 8వ స్ధానంలో కొనసాగుతున్నాడు.
260 ఇన్నింగ్స్‌లలో రూట్ ఇప్పటివరకు 11,940 పరుగులు చేశాడు. కాగా సచిన్ 329 టెస్టు ఇన్నింగ్స్‌లలో 15921 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(13378) ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment