Test runs record
-
సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేది అతడే: రిక్కీ పాంటింగ్
అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్ సచిన్ టెండుల్కర్. టెస్టుల్లో 15,921... వన్డేల్లో 18,426 పరుగులతో ఓవరాల్‌గా రెండు ఫార్మాట్లలోనూ ఈ టీమిండియా దిగ్గజం టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక సచిన్ సాధించిన సెంచరీల రికార్డుకు చేరువగా ఉన్న ఏకైక క్రికెటర్ టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లి.ఇప్పటికే 80 శతకాలు బాదిన 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మరో 20 మార్లు వంద పరుగుల మార్కును అందుకుంటే సచిన్ టెండుల్కర్ రికార్డును సమం చేస్తాడు. అయితే, వన్డేల్లో ఇప్పటి వరకు 13,906 పరుగులు సాధించి.. టాప్ స్కోరర్ల జాబితాలో ఉన్న కోహ్లి టెస్టు ఖాతాలో 8848 పరుగులు మాత్రమే ఉన్నాయి.ఈ నేపథ్యంలో వన్డే కింగ్ అయిన కోహ్లి టెస్టుల్లో మాత్రం సచిన్‌ను అందుకోవడం కష్టమే అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్. టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్‌కు ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లిష్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్ ప్రస్తుతం బెన్‌స్టోక్స్ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.అప్పట్లో ఫామ్‌లేమితో సతమతమైన 33 ఏళ్ల ఈ రైట్‌హ్యాండర్.. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో 32వ సెంచరీ సాధించిన రూట్.. 12 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘ఇంకో నాలుగేళ్ల పాటు రూట్ టెస్టుల్లో కొనసాగితే కచ్చితంగా ఇది సాధ్యమవుతుంది.అయివతే, ఇంగ్లండ్ ఏడాదికి ఎన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడుతుందన్న అంశం మీదే అతడి గణాంకాలు ఆధారపడి ఉంటాయి. ఏడాదికి కనీసం 14 మ్యాచ్‌లు ఆడటం సహా అందులో సంవత్సరానికి రూట్ 800 నుంచి వెయ్యి పరుగుల చొప్పున సాధిస్తే అతడు సచిన్ రికార్డు బ్రేక్ చేయడం సాధ్యమే.అయితే, 37 ఏళ్ల వయసులోనూ అతడు పరుగుల దాహంతో ఉంటేనే.. అది కూడా రోజురోజుకు తన ఆటను మరింత మెరుగుపరచుకుని.. నిలకడగా రాణిస్తేనే రూట్‌కు ఈ అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల క్రితం కనీసం యాభై పరుగుల మార్కు అందుకోవడానికి కష్టాలు పడ్డ రూట్.. ఇప్పుడు తన శైలిని మార్చేశాడు. అందుకే మరో నాలుగేళ్లపాటు అతడు ఇలాగే కొనసాగితే.. కచ్చితంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరిస్తాడు’’ అని రిక్కీ పాంటింగ్ అంచనా వేశాడు. ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సైతం గతంలో ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు.కాగా టెస్టుల్లో ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ టెస్టుల్లో 13,378 పరుగులు సాధించి.. సచిన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో సౌతాఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలిస్(13,289), టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్(13,288), ఇంగ్లండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్(12,472), శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ కుమార్ సంగక్కర(12, 400) తర్వాత ఏడో స్థానంలో రూట్(12,027) ఉన్నాడు. -
జో రూట్ అరుదైన ఘనత.. లారా ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన ఏడో బ్యాటర్‌గా జో రూట్ రికార్డులకెక్కాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రూట్ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు 143 మ్యాచ్ (261 టెస్టు ఇన్నింగ్స్‌లు) లు ఆడిన రూట్ 11954 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరిట ఉండేది. లారా 131 మ్యాచ్‌ల్లో 11953 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో లారా ఆల్‌టైమ్ రికార్డును రూట్ బ్రేక్ చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(15,921) అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. సచిన్ తర్వాతి స్ధానాల్లో రికీ పాంటింగ్(13,378), జాక్వెస్ కల్లిస్(13, 289), రాహుల్ ద్రవిడ్(13,288), అలిస్టర్ కుక్(12,472), కుమార్ సంగక్కర(12,400) ఉన్నారు. ఇక విండీస్‌తో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 87 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ టెస్టు కెరీర్లో 32 సెంచరీలు కూడా ఉన్నాయి. -
కోహ్లిని తలపిస్తున్న పాక్ కెప్టెన్.. ఖాతాలో మరో మైలురాయి
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొడుతూ ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. తాజాగా శ్రీలంకతో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో బాబర్ ఆజం వీరోచిత సెంచరీతో మెరిశాడు. తన ఇన్నింగ్స్‌తో జట్టు తక్కువ స్కోరుకు ఆలౌట్ కాకుండా కాపాడి ప్రత్యర్థికి కేవలం 4 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కేలా చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 55 పరుగుల విలువైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న బాబర్ ఆజం ప్రభాత్ జయసూర్య అద్భుత బంతికి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కెప్టెన్‌గా బాబర్ ఆజం టెస్టుల్లో అరుదైన ఫీట్ సాధించాడు. టెస్టుల్లో 3వేల పరుగులు మార్క్‌ను అధిగమించాడు. 41 టెస్టుల్లో బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు. కెరీర్లోనే పీక్ ఫామ్‌లో ఉన్న బాబర్ ఒక రకంగా టీమిండియా స్టార్ కోహ్లిని తలపిస్తున్నాడు. 2015-16లో కోహ్లి కూడా ఇదే తరహా ఫామ్ కనబరిచాడు. ఇక శ్రీలంకతో తొలి టెస్టులో సెంచరీ మార్క్‌ను అందుకోవడం ద్వారా 9వ సెంచరీ అందుకున్నాడు. పాకిస్తాన్ కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో పాక్ దిగ్గజం ఇంజమామ్ ఉల్ హక్‌తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నాడు. అయితే ఇంజమామ్ 131 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు చేస్తే.. బాబర్‌కు మాత్రం 9 సెంచరీలు సాధించడానికి 70 ఇన్నింగ్స్‌లు మాత్రమే అవసరమయ్యాయి. మ్యాచ్ విషయానికి వస్తే నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. అబ్దుల్లా షఫీక్ 112, మహ్మద్ రిజ్వాన్ ఏడు పరుగులతో క్రీజులో ఉన్నారు. పాక్ విజయానికి 120 పరుగులు అవసరం కాగా.. లంకకు ఏడు వికెట్లు అవసరం. మరొక రోజు ఆట మిగిలి ఉండడంతో లంక బౌలర్లు మ్యాజిక్ చేస్తారా.. లేక ప్యాక్ బ్యాటర్లకు దాసోహం అంటారా అనేది వేచి చూడాలి. Another milestone for @babarazam258 👏 Well done skipper on completing 3⃣0⃣0⃣0⃣ Test runs 🙌#SLvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/wauEWE5y3W — Pakistan Cricket (@TheRealPCB) July 19, 2022 చదవండి: Pak Vs SL 1st Test: ఏమని వర్ణించగలం?.. బాబర్ ఆజంకే దిమ్మ తిరిగింది యాసిర్ షా 'బాల్ ఆఫ్ ది సెంచరీ'... దిగ్గజ బౌలర్ గుర్తురాక మానడు -
పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ ఘనత
అబుదాబి: పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అజహర్ అలీ మరో ఘనత సాధించాడు. టెస్టుల్లో 5 వేల పరుగులు మైలురాయిని అందుకున్నాడు. తమ దేశం తరపున ఈ రికార్డు సాధించిన 8వ క్రికెటర్‌గా నిలిచాడు. 32 ఏళ్ల అజహర్ 61వ టెస్టులో 5 వేల పరుగులు పూర్తి చేశాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి డే నైట్ టెస్టులో అతడు అర్థసెంచరీ చేశాడు. 200 బంతుల్లో 3 ఫోర్లతో 74 పరుగులు సాధించాడు. పాక్ తరపున వేగంగా 5 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా అతడు ఘనతకెక్కాడు. 2010లో లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లోకి అడుగుపెట్టిన అజహర్ పాక్ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. దుబాయ్‌లో గతేడాది వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి.. డే నైట్ టెస్టులో శతకం బాదిన తొలి బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. యూనిస్ ఖాన్(10,099), జావెద్ మియందాద్(8,832), ఇంజమామ్-వుల్-హక్(8,829), మహ్మద్ యూసఫ్(7,530) పాకిస్తాన్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించారు. కాగా, శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో 64/0 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పాకిస్తాన్ ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 419 పరుగులకు ఆలౌటైంది. -
'సచిన్ అంత గొప్పవాడ్ని కాదు'
న్యూఢిల్లీ: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గ్రేట్ ప్లేయర్ అని, తాను సచిన్ అంత గొప్పవాడిని కాదని ఇంగ్లండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్ అంటున్నాడు. టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ పేరిట ఉన్న అత్యధిక టెస్టు పరుగుల రికార్డును కుక్ బ్రేక్ చేస్తాడని ఇటీవల సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. మరో 6-8 ఏళ్లు టెస్టు క్రికెట్ ఆడితే సచిన్ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించవచ్చని చెప్పాడు. శ్రీలంకతో గురువారం మూడో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో కుక్ మీడియాతో కాసేపు ముచ్చటించాడు. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో ఉన్న కుక్ సేన లార్డ్స్ లో మూడో టెస్ట్ ఆడనుంది. అయితే తనపై ఎన్నో అంచనాలు ఉన్నాయని, వాటిని సాధించేందుకు చాలా సమయం పడుతుందని కుక్ చెప్పాడు. టెస్టుల్లో 10 వేల పరుగులు సాధించిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా, ఈ రికార్డు నెలకొల్పిన అతి పిన్న వయస్కుడిగానూ కుక్ ఇటీవల రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ 31 ఏళ్ల 10 నెలల వయసులో ఈ రికార్డు నెలకొల్పగా, కుక్ 31 ఏళ్ల 5 నెలల వయసులోనే ఈ ఫీట్ సాధించి సచిన్ రికార్డు తిరగరాశాడు. కుక్ 128 టెస్టుల్లో 47 సగటుతో 10,042 పరుగులు చేయగా, సచిన్ మొత్తం 200 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 54 సగటుతో 15,921 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ కు మరింత కాలం ఆడాలని ఉందని, అలా చేసినప్పుడే సచిన్ రికార్డును మరోసారి బ్రేక్ చేయగలనని అభిప్రాయపడ్డాడు. తాను జీనియస్ అయినా సచిన్ తనకంటే గొప్ప ఆటగాడని ప్రశంసించాడు. అత్యధిక పరుగుల రికార్డు తిరగరాయాలంటే దాదాపు 6వేల పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరికి మాత్రమే అలాంటి విజయాలు, రికార్డులు సాధ్యమవుతాయని చెప్పాడు. వ్యక్తిగతంగా చూసుకుంటే తనకు చాలా లక్ష్యాలు ఉన్నాయని, ఇంగ్లండ్ టీమ్ కు మరిన్ని విజయాలు సాధించి పెట్టడంపైనే దృష్టిసారిస్తున్నట్లు అలెస్టర్ కుక్ వివరించాడు.