
నా టార్గెట్ వాళ్లే: నెం1 బౌలర్
లండన్: తాను టెస్టుల్లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకు సాధించినప్పటికీ దక్షిణాఫ్రికాకు చెందిన బౌలర్ డెల్ స్టెయిన్ తన జనరేషన్ బౌలరని ఇంగ్లండ్ పేస్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డాడు. టాపార్డర్ వికెట్లు తీయడమే తన టార్గెట్ అని, దాంతో జట్టుకు విజయాన్ని అందించడం సులువవుతుందని చెప్పాడు. 91 టెస్టుల్లో 28.66 సగటుతో 333 వికెట్లు తీయగా... సఫారీ స్పీడ్ స్టార్ స్టెయిన్ 82 టెస్టుల్లో 22.53 సగటుతో 406 వికెట్లు పడగొట్టాడు. అందుకే గ్రేట్ ఫాస్ట్ బౌలర్లు వెస్టిండీస్ కు చెందిన మాల్కమ్ మార్షల్, ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ, ఇంగ్లండ్ కు చెందిన ఫ్రెడ్ ట్రూమన్ సగటు మాత్రమే 20 కంటే తక్కువగా ఉందన్నాడు.
ఇప్పటికీ అదేమాట చెబుతున్నాను.. డెల్ స్టెయిన్ కంటే తానే అత్యుత్తమ బౌలర్ నని చెప్పాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కు సిద్ధమవుతున్న స్టూవర్ట్ బ్రాడ్ గతంలో తాను చేసిన కామెంట్లపై వివరణ ఇచ్చుకున్నాడు. స్టెయిన్ ను ఈ జనరేషన్ బౌలర్ అని మాత్రమే చెప్పాను, బెస్ట్ బౌలర్ అని చెప్పలేదని వివరించాడు. బెస్ట్ ర్యాంకు కోసం తాను చాలా శ్రమపడ్డాననీ, అందుకే టాప్ ర్యాంకు తన సొంతమైందన్నాడు. బెస్ట్ బౌలింగ్ వనరులున్న సహచరులతో పోటీ పడి వికెట్లు తీయడం చాలా కష్టమంటున్నాడు