అబ్బ ఏం అందం ఆమెది: అండర్సన్‌ | Andersons First Thoughts When He Saw Stuart Broad | Sakshi
Sakshi News home page

అబ్బ ఏం అందం ఆమెది: అండర్సన్‌

Published Fri, May 24 2019 12:15 PM | Last Updated on Fri, May 24 2019 10:16 PM

Andersons First Thoughts When He Saw Stuart Broad - Sakshi

లండన్‌: తన సహచర క్రికెటర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ను తొలిసారి చూసినప్పుడు అమ్మాయిలా అనిపించాడని ఇంగ్లండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌ వెల్లడించాడు. బ్రాడ్‌ను మొదటిసారి చూసిన క్షణంలో ‘ఆమె ఎంత అందంగా ఉంది’ అని అనుకున్నాని అండర్సన్‌ పేర్కొన్నాడు. బౌల్‌.స్టీప్‌.రిపీట్‌ పేరుతో తాను రాసిన పుస్తకంలో అండర్సన్‌ ఈ విషయాన్ని బయటపెట్టాడు.  ‘బంగారు వర్ణంలో పొడవైన కురులు.. మత్తెక్కించే నీలి కళ్లు..అబ్బ ఏం అందం ఆమెది’ అని అనుకున్నాని అండర్సన్‌ తెలిపాడు.

ఇక బ్రాడ్‌తో పోటీ గురించి ప్రస్తావిస్తూ.. తమ మధ్య ఎటువంటి పోటీని ఎప్పుడూ చూడలేదన్నాడు. మా ఇద్దరిదీ విభిన్నమైన బౌలింగ్‌ శైలి అని, దాంతో ఎప్పుడూ బ్రాడ్‌తో తనకు పోటీ లేదని చెప్పుకొచ్చాడు. తానొక స్వింగ్‌ బౌలర్‌ని అయితే, బ్రాడ్‌ బౌన్స్‌తో పాటు బంతిని తన సీమ్‌తో ఇరువైపులా మూవ్‌ చేయడంలో సిద్ధహస్తుడన్నాడు.దాంతో సెలక్షన్‌ పరంగా తమకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదన్నాడు. ఇప్పటివరకూ 148 టెస్ట్‌ల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించిన 36 ఏళ్ల ఆండర్సన్‌ 575 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement