17 ఏళ్ల తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ వేదికగా ఇంగ్లండ్ జట్టు బాబర్ సేనతో టెస్టుల్లో తలపడనుంది. అయితే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్‌కు ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వ్యక్తిగత కారణాలతో దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. రావల్పిండి వేదికగా డిసెంబర్ 1న ప్రారంభం కానున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
అయితే బ్రాడ్ భార్య మోలీ కింగ్ నవంబర్ మధ్యలో తమ మొదటి బిడ్డకు జన్మనివ్వనుండడంతో.. అతడు ఈ సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా బ్రాడ్ ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టులో కీలక సభ్యుడుగా ఉన్నాడు. న్యూజిలాండ్, దక్షాణాఫ్రికా, భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ విజయంలో బ్రాడ్ ముఖ్య భూమిక పోషించాడు.
ఇక ఇది ఇలా ఉండగా.. ఇంగ్లండ్ చివరసారిగా 2005లో పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో తలపడింది. ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో కోల్పోయింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడింది. ఈ సిరీస్‌ను 4-3 ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.
చదవండి: T20 World Cup 2022: బుమ్రా స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు.. మహ్మద్ షమీ? దీపక్ చాహర్?
Comments
Please login to add a commentAdd a comment