లండన్: అండర్సన్ 640 వికెట్లు... స్టువర్ట్ బ్రాడ్ 537 వికెట్లు... టెస్టుల్లో వీరిద్దరు కలిసి ఏకంగా 1,177 వికెట్లు పడగొట్టి సుదీర్ఘ కాలంగా ఇంగ్లండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అయితే యాషెస్ సిరీస్‌లో 0–4తో చిత్తయిన ప్రభావం ఈ ఇద్దరు దిగ్గజ బౌలర్లపై కూడా పడింది. వెస్టిండీస్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో అండర్సన్, బ్రాడ్‌లకు చోటు దక్కలేదు.
ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఇద్దరు బౌలర్లను తప్పించి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కఠిన నిర్ణయం తీసుకుంది. యాషెస్ పరాజయం తర్వాత హెడ్ కోచ్, అసిస్టెంట్ కోచ్, మేనేజింగ్ డైరెక్టర్‌లను తప్పించిన బోర్డు ఇప్పుడు ఆటగాళ్లపై వేటు వేసింది. ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమ్ నుంచి మొత్తం ఎనిమిది మందిని తప్పించడం గమనార్హం. బట్లర్, రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, మలాన్, స్యామ్ బిల్లింగ్స్, డామ్ బెస్ కూడా జట్టులో స్థానం కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment