యువీ సిక్సర్ల సునామీ.. నేటికి ఆ పెను విధ్వంసానికి 14 ఏళ్లు | September 19, 2007: Yuvraj Singh Hit 6 Sixes Off Stuart Broad In T20 World Cup | Sakshi
Sakshi News home page

Yuvraj 6 Sixes: యువీ సిక్సర్ల సునామీ.. ఆ విధ్వంసం జరిగి నేటికి 14 ఏళ్లు

Published Sun, Sep 19 2021 2:20 PM | Last Updated on Sun, Sep 19 2021 3:07 PM

September 19, 2007: Yuvraj Singh Hit 6 Sixes Off Stuart Broad In T20 World Cup - Sakshi

Yuvraj Singh 6 Sixes In T20 World Cup 2007: సరిగ్గా 14 ఏళ్ల క్రితం పొట్టి ఫార్మాట్‌లో పెను విధ్వంసం చోటు చేసుకుంది. 2007 సెప్టెంబర్‌ 19న టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది పొట్టి క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించాడు. ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 19 ఓవర్‌లో యువీ పూనకం వచ్చినట్లుగా ఊగిపోయి వరుస సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈక్రమంలో 12 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించాడు. నేటికీ ఆ రికార్డు చెక్కు చెదరకుండా యువీ పేరిటే ఉంది.

ఆ ఇన్నింగ్స్‌లో 16 బంతులు ఎదుర్కొన్న యువరాజ్‌.. 7 భారీ సిక్సర్లు సహా 3 ఫోర్లు బాది 58 పరుగులు చేశాడు. ఫలితంగా ఆ మ్యాచ్‌లో టీమిండియా 218 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేయగా ఛేదనలో ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లు ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 18 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. యువీకే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.
చదవండి: ఆ మూడు బాదితే రోహిత్‌ ఖాతాలో మరో రికార్డు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement